
మోదీ పొదుపు మంత్రం: చేవెళ్లలో ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి అమలు
ఎల్పీజీకి బదులు బీజీఎస్, చపాతీ స్థానంలో పుల్కా..ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి కొత్త సందేశం
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రజలకు పొదుపు మంత్రం పేరుతో చేసిన సూచనలను చేవేళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలంగాణలో అమలు చేస్తున్నారు.మోదీ పిలుపును ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన చురుకైన పాత్ర పోషిస్తున్నారు.
ఈవీ కార్లపై ప్రచారం
పెరిగిపోతున్న ముడిచమురు ధరల నేపథ్యంలో తాను తన వంతు కృషి చేస్తున్నానని ప్రకటించారు. ‘‘చేవెళ్ల నియోజకవర్గంలో నేను, నా బృందం ఎప్పుడూ రెండు డీజిల్ కార్లలో ప్రయాణించేవాళ్లం. యుద్ధం మొదలైనప్పటి నుంచి నేను, నా బృందం ఒకే కారులో వెళ్లడం మొదలుపెట్టాం’’అని ఎంపీ విశ్వేశ్వరరెడ్డి ఎక్స్ పోస్టులో వెల్లడించారు.మోదీ చమురు దిగుమతులు తగ్గించాలని కోరిన నేపథ్యంలో, విశ్వేశ్వర్ రెడ్డి తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల (EVs) వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు.
ఐటీ కారిడార్ (హైదరాబాద్) లోని ఉద్యోగులు వీలైనంత వరకు ప్రజా రవాణా లేదా ఈవీలు వాడాలని ఆయన పిలుపునిచ్చారు.
ఎల్ పీజీ స్టవ్ కు ప్రత్యామ్నాయంగా బీజీఎస్ స్టవ్
ఎల్‌పీజీకి ప్రత్యామ్నాయంగా బీజీఎస్
బయోమాస్ గ్యాసిఫైయర్ స్టవ్‌లను మరింత ఉధృతంగా ప్రోత్సహించాలని ఎంపీ కె విశ్వేశ్వర్ రెడ్డి కోరారు.
పుల్కాలు తయారు చేస్తున్న ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి (ఫొటో : ఎక్స్ పోస్టు)
చపాతీల స్థానంలో పుల్కాలు
ప్రజలంతా నూనె చపాతీల నుంచి పుల్కాలు, జొన్న రొట్టెలకు మారాలని ఎంపీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
బంగారం కొనవద్దని ప్రచారం

