
నేడు తెలంగాణలో భారీ గా పెరుగనున్న ‘పొలిటికల్ హీట్’
ఒక రోజున ముఖ్యమంత్రి రేవంత్, బిఆర్ ఎస్ అధినేత కెసిఆర్ బల ప్రదర్శన
తెలంగాణలో కొన్ని చోట్ల పగటి ఉష్ణోగ్రత 44 డిగ్రీల సెంటిగ్రేడ్ దాటింది. అయితే సోమవారం నాడు ‘రాజకీయ తెలంగాణ’ భగ్గున మండే అవకాశం ఉంది. రాష్ట్ర పొలిటికల్ టెంపరేచర్ మరోసారి అంతకంటే ఎక్కువగా విపరీతంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు, ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఈ రోజు ఘాటుగా మాట్లాడబోతున్నారు. వారు ఏమ్మాట్లాతారు, ఎలాంటి విమర్శలు చేసుకుంటారు, ఎలాంటి సవాళ్లు విసురుకుంటారు? అనేది ఉత్కంఠ. ఇద్దరు పోటా పోటీగా ఒకే రోజు వేర్వేరు బహిరంగ సభలకు హాజరు కానుండటంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగుతోంది. ముఖ్యంగా జగిత్యాల సభలో ‘కెసిఆర్ మళ్లీ రావాలి’ అనేది నినాదం మారు మ్రోగే అవకాశం ఉంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కటారం మండలం నాస్తుర్‌పల్లిలో జరిగే బహిరంగ సభలో 'రైతు భరోసా' పథకం కింద రైతులకు అందించే రెండో విడత ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి అట్టహాసంగా ప్రారంభిస్తారు. రైతు భరోసా ఏమైంది అని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి ఏప్రిల్ 20న ఈ నిధులు విడుదల చేసేందుకు ముహూర్తం పెట్టుకున్నారు. ఏప్రిల్ 20 అంటే ఏమిటి? ఈ రోజునే బిఆర్ ఎస్ జగిత్యాల్ లో ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు టి.జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తూ ఈ బహిరంగ సభను ఏర్పాటుచేస్తున్నది దీనిని ఉత్తర తెలంగాణ లో బిఆర్ ఎస్ పునరాగమణ సూచనగా ఆ పార్టీ నిర్వహిస్తాంది.దీనికి పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ కూడావస్తున్నారు. ఉత్తర తెలంగాణ ఒకప్పుడు బిఆర్ ఎస్ కంచుకోట. ఈ కోట బద్ధలయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, 2024 లోక్ సభ ఎన్నికల్లో ఈ కంచుకోటలోకి బిజెపి బలంగా ప్రవేశించింది. కాంగ్రెస్ తనకందినంత లాగేసుకుంది. ఈ నేపథ్యంలో కెసిఆర్ క్యాడర్ లో భరోసా నింపేందుకు జీవన్ రెడ్డికి స్వాగతం చెబుతూ బ హిరంగ సభలో గర్జించబోతున్నారు. దాదాపు ఒక ఏడాది తర్వాత కేసీఆర్ తిరిగి ప్రజల ముందుకువస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత ఆయన సభలకు దూరంగా ఉన్నారు. గత ఏడాది ఏప్రిల్ 27న వరంగల్‌లో జరిగిన పార్టీ రజతోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నాక మళ్లీ ఎక్కడా కనిపించలేదు. ఆయన కార్యక్రమాలన్నీ ఫామ్ హౌస్ నుంచే సాగుతున్నాయి. ఈ రోజు జగిత్యాల సమావేశానికి వస్తున్నారు. ’కెసిఆర్ మళ్లీ రావాలి’ అనే నినాదం ఇచ్చిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి సమక్షంలో ఆయన ఏమ్మాట్లాడతారు, ఉత్తర తెలంగాణ ప్రజలకు ఏం సందేశం ఇస్తారనేది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజు సెన్సేషనల్ కార్యక్రమాలు ప్రారంభించింది. అందులో ఒకటి రైతు భరోసా డబ్బు విడుదల. ఈ కార్యకమ్రాన్ని కాంగ్రెస్ పార్టీ క రైతు పండగలాగా జరుపుకోనుంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో కలసి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో రిమోట్‌గా నిధులను విడుదల చేస్తారు. ఉత్కంఠను పెంచుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీని సీఎం రేవంత్ కూడా సందర్శించనున్నారు. ఈ ప్రాజక్టును రేవంత్ కెసిఆర్ అవినీతికి తార్కాణంగా చెబుతూ వస్తున్నారు. ఈ ప్రాజక్టు పయర్లు కుంగిపోవడం కెసిఆర్ కు పెద్ద తగిలింది. 2023 ఎన్నికల్లో ఓడిపోయేందుకు అదొక కారణమని చెబుతారు. ప్రాజక్టులో అవినీతి పారి, నిర్మాణంలో లోపభూయిష్టంగా జరిగడంతో బరాజ్ పిల్లర్లు కూలిపోయాయనేది కాంగ్రెస్ వాదన. దీని మీద విచారణ కూడా జరిగింది. ఈపుడు రేవంత్ ప్రభుత్వం ఈ ప్రాజక్టుకు మరమ్మతులు చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. ఈ సందర్భంగా సాగుతున్న సందర్శనలో రేవంత్ రెడ్డి మరొక సారి కెసిఆర్ ప్రభుత్వ అవినీతి, కుటుంబ రాజకీయాలను, రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతున్న భారం గురించి ప్రస్తావించవచ్చు.
ముఖ్యమంత్రి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సోమవారం మేడిగడ్డను తనిఖీ చేయనున్నారు. ఈసారి కాళేశ్వరంలో రేవంత్ సవాళ్లు ఏమిటి, వాటికి బిఆర్ ఎస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
బిఆర్ ఎస్ జగిత్యాల బహిరంగ సభనుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రేవంత్ రెడ్డి మేడిగడ్డ ప్రాజక్టును సందర్శిస్తున్నారని, ఇది చవకబారు రాజకీయమని బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెశిడెంట్ కెటి రా మారావు విమర్శించారు. “ గత రెండున్నరేళ్లలో ఒక్కసారైనా ముఖ్యమంత్రిగా మేడిగడ్డ సందర్శించలేదు. ఇపుడు కెసిఆర్ బహిరంగ సభ జరుగుతున్న రోజునే ఈ పర్యటన జరపడం వెనక దురుద్దేశం ఉంది. దీనిని ప్రజలు గమనిస్తున్నారు,” అని కెటిఆర్ విమర్శించారు.

