x

‘మనుషుల మీద కోట్లరూపాయల మాఫియా జరుగుతోంది’ (వీడియో)

వేలాది ఏజెన్సీలు ఔట్ సోర్పింగ్ ఉద్యోగులకు ప్రతినెలా జీతాలు కూడా చెల్లించటంలేదని ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ ఆవేధన వ్యక్తంచేశారు


రాష్ట్రంలో 4800 ఏజెన్సీల ద్వారా పనిచేస్తున్న సుమారు 4.5 లక్షలమంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు. వీటిల్లో 4300 ఏజెన్సీలు ఉద్యోగుల తరపున ప్రతినెలా చెల్లించాల్సిన పీఎఫ్, ఈఎస్ఐ ప్రభుత్వానికి చెల్లించాల్సిన జీఎస్టీ చెల్లించటంలేదని ఉన్నతాధికారుల కమిటీయే సీఎంకు రిపోర్టు ఇచ్చింది. వేలాది ఏజెన్సీలు ఔట్ సోర్పింగ్ ఉద్యోగులకు ప్రతినెలా జీతాలు కూడా చెల్లించటంలేదని ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ ఆవేధన వ్యక్తంచేశారు.

ఏజెన్సీల పనితీరుపై 45 రోజుల్లో ఆడిట్ చేసి రిపోర్టు అందించాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు చెప్పారు. ఏజెన్సీల సంఖ్య, ఎంతకాలంగా పనిచేస్తున్నాయి, ఉద్యోగులకు చెల్లిస్తున్న వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ లాంటి ప్రయోజనాల చెల్లింపుల వివరాలన్నింటినీ రిపోర్టు ద్వారా అందించాలని రేవంత్ ఆదేశించినట్లు తెలిపారు. ఉన్నతాధికారుల రిపోర్టు జిల్లాల్లోని అన్నీ శాఖల అధికారులకు, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్ మెంట్ అధికారులకు అందినట్లు స్పష్టంచేశారు.

32 అంశాలతో కూడిన ప్రొఫార్మాను ఫిలప్ చేసిన రిపోర్టును ఉన్నతాధికారులు రెడీచేసి సీఎంకు అందించాలి. కొన్ని శాఖల్లోని అధికారులు ప్రొఫార్మాలో ఉద్యోగులకు ఏవీ పెండింగ్ లేదని తప్పుడు రిపోర్టు పంపే ప్రమాదం కూడా ఉంది. అందుకనే అధికారులు తయారుచేసే రిపోర్టుకు ప్యారలల్‌గా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, నేతలు మరో రిపోర్టును తయారుచేయబోతున్నారు. అధికారుల మద్దతుతోనే చాలా ఏజెన్సీలు అక్రమాలకు పాల్పడుతు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నాయి.

ఏజెన్సీల అక్రమాల్లో ఉన్నతాధికారుల వందశాతం పాత్రతో పాటు ఏజెన్సీల ఏర్పాటు, అక్రమాల్లో రాజకీయ నేతల ప్రోద్బలం కూడా ఉందని పులి లక్ష్మక్ష్య ఆరోపించారు. సీఎం రేవంత్ చొరవతో ఔట్ సోర్సింగ్ సమస్యలు ఇప్పటికైనా పరిష్కారం అవుతాయని ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ పులి లక్ష్మయ్య ఆశాభావం వ్యక్తిచేశారు.

Read More
Next Story