మాజీ ఐపిఎస్ అధికారి భార్య హత్య తాజా సమాచారం
x

మాజీ ఐపిఎస్ అధికారి భార్య హత్య తాజా సమాచారం

నేపాలీ పనిమనుషుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని నగర్ పోలీసు కమిషనర్ హెచ్చరిక


మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్యకు సంబంధించి హైదరాబాద్ నగర్ పోలీసు కమిషనర్ ఆసక్తికరమయిన విషయాలు వెల్లడించారు. ఈ దారుణానికి పాల్పడింది నేపాళీ ముఠా లని, ప్రజలు నేపాలీ పనిమనుషుల విషయం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

ఈ ముఠా గురువారం తెల్లవారుజామున తనూజను హత్య చేసింది. నోట్లో గుడ్డలు కుక్కి ఊపిరాడకుండా చేసి ఆమెను హత్య చేశారు. హైదరాబాద్ లోనే కాదు, బెంగళూరు, ముంబై, పుణె నగరాల్లో నేపాలీ ముఠాలు నేరాలకు పాల్పడుతున్నాయని, తనూజ హంతకులను పట్టుకునేందుకు 10 బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని ఆయన చెప్పారు.

తనూజ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తయిందని చెబుతూ ప్రశాసన్ నగర్‌లోని ఐపీఎస్ అధికారి నివాసానికి ఆమె మృతదేహాన్ని తరలిస్తున్నట్లు ఆయన చెప్పారు.

గురువారం రాత్రి రెండు గంటలకు హంతకులు ఇంట్లోకి చొరబడి తనుజను హత్య చేసి నగదుతో పరారయ్యారని, ఐపిఎస్ అధికారి నివాసంలో పని చేసే నేపాల్‌కు చెందిన కల్పన అనే మహిళ ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఎలా జరిగిఉంటుంది

ఇంట్లో వినయ్ రంజన్ లేకపోవడంతో బయట నుండి మరో ముగ్గురిని కల్పన పిలిపించి ఈ దారుణానికి కల్పన ఓడిగట్టింది. తనూజను బంధించడానికి తమతో పాటే నిందితులు క్లాత్ తెచ్చుకున్నారు. ఈ దోపిడి అనంతరం ఇంటి వెనుక భాగం పార్క్ లో నాంపల్లి రైల్వే స్టేషన్‌కు ఆటోలో చేరుకున్నారు. అక్కడి నుంచి తెలంగాణ ఎక్స్‌ప్రెస్ లో నిందితులు ఢిల్లీ వెళ్లారని అనుమానిస్తున్నారు. వారి ఆచూకి కనుగొనేందుకు రెండు పోలీస్ బృందాలు నేపాల్‌కు పంపారు.

Read More
Next Story