పార్టీ కాదు… విప్లవం : బీఆర్‌ఎస్ 25 ఏళ్లపై కేటీఆర్ భావోద్వేగం
x
జలదృశ్యంలో 2001లో జరిగిన టీఆర్ఎస్ ఆవిర్భావ సభ లో ప్రసంగిస్తున్న కేసీఆర్ (ఫొటో : ఎక్స్ పోస్టు/కేటీఆర్)

పార్టీ కాదు… విప్లవం : బీఆర్‌ఎస్ 25 ఏళ్లపై కేటీఆర్ భావోద్వేగం

ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సందేశం


బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు కేటీఆర్ గులాబీ కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 2001 ఏప్రిల్ 27న ప్రారంభమైన ఈ ప్రయాణం తెలంగాణ సాధనతో పాటు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు.2001వ సంవత్సరం ఏప్రిల్ 27వతేదీన జలదృశ్యంలో ఆవిర్భవించిన గులాబీ పార్టీ 14 ఏళ్ల పోరాటంతో తెలంగాణాను సాధించిందని కేటీఆర్ గుర్తు చేశారు.

నెత్తురు మండి ఒక జాతి ఎత్తిన జెండా

25 వసంతాల మైలురాయిని అధిగమించిన మహోజ్వల లాంగ్ మార్చ్!బీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదు …ఒక విప్లవం!అంటూ కేటీఆర్ తెలిపారు. ఎత్తిన జెండాను దించకుండా పట్టుదల, నిబద్ధతతో ప్రయాణం చేసి ఎన్నో కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొని గమ్యాన్ని ముద్దాడిన ఉద్యమ వీరుడు కేసీఆర్! అంటూ బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ లో పోస్టు పెట్టారు. దశాబ్దాల స్వరాష్ట్ర పోరాటాలను గమ్యానికి చేర్చిన తెలంగాణ అస్థిత్వం బీఆర్‌ఎస్ అంటూ పేర్కొన్నారు.

‘రేవంత్ పోవాలి… కేసీఆర్ రావాలి’

‘‘నాలుగు కోట్ల గొంతులను ఏకం చేసి విప్లవ శంఖం మోగించిన ధిక్కార వేదిక,సమైక్య సంకెళ్లను తెంచి స్వరాష్ట్ర కాంక్షను సాకారం చేసిన యుద్ధ గీతిక,పదేళ్ల పాలనతో ఉద్యమ తెలంగాణను ఉజ్వల తెలంగాణగా తీర్చిదిద్దిన అభివృద్ధి పతాక,తెలంగాణ జాతి ఆత్మగౌరవ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గులాబీ దీపిక’’ అంటూ మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు ఎక్స్ పోస్టులో వ్యాఖ్యానించారు.ప్రజల విశ్వాసానికి ప్రతీక, ప్రజా ఉద్యమ పతాక.. భారత రాష్ట్ర సమితి 26 వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అని తెలిపారు."రేవంత్ పోవాలి… కేసీఆర్ రావాలి”ఉద్యమంలోనైనా, అధికారంలోనైనా, ప్రతిపక్షంలోనైనాఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడి, తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకున్న పార్టీ మన బీఆర్‌ఎస్ అంటూ హరీష్ రావు పేర్కొన్నారు.
సిల్వర్ జూబ్లీ దశలోకి అడుగుపెట్టిన బీఆర్‌ఎస్, ఉద్యమ స్పూర్తిని కొనసాగిస్తూ భవిష్యత్ రాజకీయాల్లో తన ముద్రను మరింత గట్టిగా వేయాలనే లక్ష్యంతో సాగుతోంది. గులాబీ జెండా ఎగిసే ఈ ప్రయాణం తెలంగాణ రాజకీయాల్లో ఇంకా ఎన్నో మలుపులు తీసుకురానుందనేది వేచి చూడాల్సిందే.
Read More
Next Story