పద్మ అవార్డుల ప్రదానం ఘనం.. తెలుగు రాష్ట్రాలకు గౌరవం
x

పద్మ అవార్డుల ప్రదానం ఘనం.. తెలుగు రాష్ట్రాలకు గౌరవం

రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానం ఘనంగా జరిగింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు పురస్కారాలు అందుకున్నారు.


ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. తొలి విడత కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 66 మంది విజేతలకు ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందజేశారు. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు చోటు దక్కించుకోవడం విశేషంగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల నుంచి గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌కు మరణానంతరం పురస్కారం ప్రకటించగా.. గూడూరు వెంకట్ రావు, పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి, వెంపటి కుటుంబ శాస్త్రి, దీపికా రెడ్డి కూడా అవార్డులు అందుకున్నారు.

ఈ ఏడాది మొత్తం 131 మందిని పద్మ పురస్కారాలకు కేంద్రం ఎంపిక చేసింది. ఇందులో 5 పద్మ విభూషణ్‌, 13 పద్మ భూషణ్‌, 113 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. మిగిలిన విజేతలకు రెండో విడత కార్యక్రమంలో పురస్కారాలు అందజేయనున్నారు.

పద్మ విభూషణ్

  • ధర్మేంద్ర (మరణానంతరం) – సినీ రంగం
  • డా. ఎన్. రాజమ్ – కళారంగం

పద్మ భూషణ్

  • పీయూష్ పాండే (మరణానంతరం) – ప్రకటన రంగం
  • డా. కల్లిపట్టి రామసామి పళనిస్వామి – వైద్య రంగం

పద్మశ్రీ

  • మామిడాల జగదీశ్ కుమార్ – సాహిత్యం, విద్య
  • హర్మన్‌ప్రీత్ కౌర్ – క్రికెట్
  • ప్రవీణ్ కుమార్ – పారాలింపిక్ క్రీడాకారుడు
  • ఉదయ్ సురేష్‌కుమార్ కోటక్ – వ్యాపార రంగం
  • కైలాష్ చంద్ర పాంటెనియర్ – జర్నలిజం
  • కే. పజనివేల్ – సంప్రదాయ యుద్ధ కళలు
  • సత్యనారాయణ నూవాల్ – రక్షణ తయారీ రంగం
  • ప్రోసెంజిత్ ఛటర్జీ
  • కుమార్ బోస్
  • భగత్ సింగ్ కోశ్యారీ
  • శతావధాని డా. ఆర్. గణేష్
  • హెచ్‌వీ హాండే
  • గఫారుద్దీన్ మేవాటి జోగి
  • మిర్ హాజీ కాసం
  • రఘువీర్ ఖెడ్కర్
  • దేవకి అమ్మ జి
  • రామ్‌చంద్ర గోడ్‌బోలే & సునీతా గోడ్‌బోలే (జంటగా)
  • టెచి గుబిన్
  • రతీలాల్ మోహన్‌లాల్ బోరిసాగర్
  • స్వామి బ్రహ్మదేవ్
  • బిశ్వ బంధు (మరణానంతరం)
  • భారత్ సింగ్ భారతి
  • తగా రామ్ భీల్
  • విజయ్ కుమార్ మల్హోత్రా (మరణానంతరం)
  • ఆర్. కృష్ణన్ కిట్నా (మరణానంతరం)
  • ప్రొఫ్. డా. లార్స్-క్రిస్టియన్ కోచ్
  • తెలుగు రాష్ట్రాల నుంచి పురస్కార గ్రహీతలు
  • గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (మరణానంతరం)
  • గూడూరు వెంకట్ రావు
  • పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి
  • వెంపటి కుటుంబ శాస్త్రి
  • దీపికా రెడ్డి
Read More
Next Story