
భారత యుద్ధ నౌకను ఢీ కొట్టిన పాక్ నౌకాదళం
తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విదేశాంగ శాఖ
పాక్ మరోసారి భారత్ ను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించింది. అరేబియా సముద్రంలో భారత నౌకదళానికి చెందిన ఓ నిఘా నౌకను పాక్ నౌకాదళం ఉద్దేశపూర్వకంగా ఢీ కొట్టింది. ఈ నేపథ్యంలో భారత్ బుధవారం పాకిస్తాన్ చార్జ్ డీ అఫైర్స్(సీడీఏ) ను నిలిపివేసింది.
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నివారించడానికి అన్ని సైనిక విభాగాలు తగిన జాగ్రత్తలు పాటించాలని, ఇరుపక్షాల మధ్య ఉన్న సంబంధిత ఒప్పందాలలోని నిబంధనలు గౌరవించాలని పాకిస్థానీ దౌత్యవేత్తకు సూచించినట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది.
ముద్రంలో పాకిస్తాన్ నౌకాదళాలు అమోదయోగ్యం కానీ రీతిలో ప్రవర్తించాయని, ఉద్రిక్తతలు రేపే విధంగా తమ నౌకతో భారత నౌకను ఢీ కొట్టాయని పేర్కొంది. ఈ విషయంలో ఈ రోజు విదేశాంగ శాఖ ఆయనకు తీవ్ర నిరసన తెలియజేసిందని, భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
అంతర్జాతీయ జలాల్లో జరిగిన ఈ ఘటన వల్ల పెద్ద నష్టం జరగలేదని, కానీ పాక్ నౌకా దళం ప్రవర్తన, సైనిక విన్యాసాలు, కసరత్తులు, దళాల కదలికపై ముందస్తు నోటీసుకు సంబంధించి ఏప్రిల్ 1991 లో భారత్, పాకిస్తాన్ మధ్య కుదిరిన ఒప్పందంలోని ఆర్టికల్ పదికు భిన్నంగా ఉందని పేర్కొంది. ఇస్లామాబాద్ లో కూడా భారత చార్జ్ డీ అఫైర్స్ కు ఇదే విధమైన నిరసన తెలియజేయాలని ఆదేశించింది.
Next Story

