స్కూల్ ఫీజులపై రోడ్డెక్కిన తల్లిదండ్రులు
x

స్కూల్ ఫీజులపై రోడ్డెక్కిన తల్లిదండ్రులు

అధిక ఛార్జీలు, పారదర్శకత లేకపోవడంపై నిరసనలు. ఫీజు ఫ్రీజ్ డిమాండ్, ప్రభుత్వం జోక్యం కోరిన తల్లిదండ్రులు.


హైదరాబాద్‌లో స్కూల్ ఫీజుల పెంపు తీవ్ర చర్చకు దారితీస్తోంది. ప్రైవేట్ యాజమాన్యాల వైఖరిపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మధ్యతరగతి వారు చదువలకు దూరమయ్యే పరిస్థితులు వచ్చేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు నిరసనబాటట్టారు. రామంతాపూర్‌లోని పలు పాఠశాలల ముందు తల్లిదండ్రులు భారీగా ధర్నా నిర్వహించారు. అధిక ఫీజులు, అదనపు ఛార్జీలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

గత నాలుగేళ్లలో ఫీజులు సుమారు 141 శాతం పెరిగాయని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ పరిస్థితిలో ఫీజులను ఐదు సంవత్సరాల పాటు పెంచకుండా నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లిఖితపూర్వక హామీ వచ్చే వరకు ఫస్ట్ టర్మ్ ఫీజులు చెల్లించబోమని ప్రకటించారు. పాఠశాలల్లో పారదర్శకత లేకపోవడం కూడా ప్రధాన సమస్యగా పేర్కొన్నారు. విద్యా ప్రమాణాలు తగ్గుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పేరెంట్-టీచర్ అసోసియేషన్ ఏర్పాటు చేయకపోవడంపై కూడా అభ్యంతరం తెలిపారు.

ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని తల్లిదండ్రులు కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు విస్తరిస్తాయని హెచ్చరించారు. మొత్తంగా ఈ పరిణామం నగర విద్యా వ్యవస్థపై కొత్త చర్చకు దారితీస్తోంది. ప్రభుత్వం తీసుకునే తదుపరి చర్యలపై అందరి దృష్టి నిలిచింది.

Read More
Next Story