
మూడోసారి పెరిగిన పెట్రోల్, డీజీల్ ధరలు
పది రోజుల వ్యవధిలో రేట్లు సవరించిన పెట్రోలియం కంపెనీలు..
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు, హార్ముజ్ జలసంధిలో ముడి చమురు రవాణాకు ఆటంకం ఏర్పడటంతో బ్యారెల్ ముడి చమురు ధరకు రెక్కలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా భారత్ లో ఈ ప్రభావం కనిపిస్తోంది. గడచిన రెండు వారాల వ్యవధిలో మూడుసార్లు పెట్రోల్, డీజీల్ ధరలు పెరిగాయి. తాజాగా పెట్రోల్ పై 87 పైసలు, డీజీల్ పై 91 పైసలు పెరిగింది. తాజాగా సవరించిన ధరలతో పెట్రోల్ లీటర్ కు ఢిల్లీలో రూపాయలు 98.64 నుంచి రూపాయలు 99. 51కు చేరగా, డీజీల్ ధర 91.58 నుంచి రూపాయలు 92.49 కు చేరింది.
మే 15 తరువాత పెట్రోలియం కంపెనీలు ధరలు పెంచడం ప్రారంభించాయి. ఇలా రెండు వారాల వ్యవధిలో దాదాపు 5 రూపాయాల మేర ధరలు పెరిగాయి. మొదట మే 15న మూడు రూపాయలు పెరగగా, మే 19 న 90 పైసలు, మే 22న మరో 90 పైసల మేర పెంచారు. పెరిగిన ధరలతో ఆయిల్ కంపెనీలకు రూ. 50 వేల కోట్ల మేర ఆదాయం పెరగనుంది. అయితే ఈ కంపెనీలకు ముడి చమురు ధరల పెరుగుదలతో దాదాపు రెండు లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్లు పలు నివేదికలు తెలియజేస్తున్నాయి.
Next Story

