భాగ్యనగరంలో ల్యాండ్ అయిన మోదీ..
x

భాగ్యనగరంలో ల్యాండ్ అయిన మోదీ..


ప్రధాని నరేంద్ర మోదీ.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేటలో ఆయన విమానం దిగారు. ఆయనకు తెలంగాణ బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. బేగంపేట విమానాశ్రయం నుంచి మోదీ హెచ్‌ఐసీసీకి బయలుదేరారు. ఈ పర్యటనలో మోదీ రూ.9377 కోట్లు విలువైన వివిధ ప్రాజెక్ట‌ులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, జాతికి అంకితమివ్వడం వంటటి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంలో మోదీ పలు కీలక అంశాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోభస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడిక్కడ ట్రాఫిక్ నిబంధనలను సవరించారు. దాదాపు 9000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ పర్యటనలో ‘పీఎం మిత్ర’ మెగా టెక్స్‌టైల్ సార్క్‌ ఏర్పాటు కీలకంగా మారనుంది. ఈ పార్క్ ఏర్పాటుతో టెక్స్‌టైల్ రంగంలో వేల సంఖ్యలో ఉపాధి అవకావాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read More
Next Story