
పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన ప్రధాని మోదీ..
పవన్ యోగ క్షేమాలపై ప్రధాని మోదీ ఆరా.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ప్రధాని మోదీ ఆదివారం పరామర్శించారు. ఇటీవల ముక్కుకు సర్జరీ చేయించుకుని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కల్యాణ్‌ను.. హైదరాబాద్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ స్వయంగా జూబ్లీహిల్స్‌లోని తన ఇంటికి వెళ్లి పరామర్శించారు. పవన్ యోగక్షేమాలపై ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని కోరారు. ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ చాలా కాలంగా సైనసైటిస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఆ సమస్య కొంతకాలంగా తీవ్ర ఇబ్బంది పెడుతుండటంతో ఆయన ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ(FESS) చేయించుకున్నారు. వైద్యుల సూచనల మేరకు పవన్ కల్యాణ్ తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
Next Story

