
బండి సంజయ్ కొడుకు మీద ఫోక్సో కేసు
ప్రధాని పర్యటనకు ముందరోజు షాకింగ్ మలుపు
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై పోస్కో కేసు నమోదయింది. అతని వల్ల లైంగిక వేధింపులకు గురయ్యానని ఒక మైనర్ బాలిక చేసిన ఫిర్యాదు ఆధారంగా తెలంగాణ పోలీసులు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం (పోక్సో) కింద కేసుపెట్టారు. హైదరాబాద్ శివారులోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది. అయితే, దీనికి కొన్ని గంటల ముందు, భగీరథ్ తన స్వస్థలమైన కరీంనగర్ పట్టణంలోని పోలీసులకు బాలిక, తల్లితండ్రులు తన వేధిస్తున్నారని ఫిర్యాదు చేశాడు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు ఒక రోజు ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రధాని మే 10, ఆదివారం నాడు హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు.
హైదరాబాద్ శివార్లలోని ఒక ఫామ్‌హౌస్‌లో సుమారు 17 ఏళ్ల బాలికకు బలవంతంగా మద్యం తాగించి, ఆ తర్వాత ఆమెపై లైంగిక దాడి చేశారనేది బండి సాయి బగీరత్‌పై ఉన్న ఫిర్యాదు . ఇలా రెండుసార్లు జరిగింది.
BNSలోని సెక్షన్ 74 మరియు 75, అలాగే POCSO చట్టంలోని సెక్షన్ 11/12 కింద FIR నమోదు చేసినట్లు ఒక సీనియర్ పోలీస్ అధికారి ధృవీకరించారు.
అయితే, పోలీసులు మొదట ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి విముఖత చూపారు, కానీ నమోదు చేయని పక్షంలో కోర్టును ఆశ్రయిస్తామని బాలిక తల్లిదండ్రులు బెదిరించడంతో కేసు నమోదు చేశారని తెలిసింది. అయితే, ఫిర్యాదు, ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రాలేదు.
స్నేహితుల ద్వారా భగీరథ్ కు ఆ అమ్మాయితో పరిచయం ఏర్పడిందని, కొంత కాలంగా ఆమెతో స్నేహపూర్వక సంబంధం ఏర్పడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
భగీరథ్ చెప్పిన ప్రకారం, కొంత కాలం తర్వాత ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆమెను పెళ్లి చేసుకోమని అతనిపై ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. అతను నిరాకరించడంతో, క్రిమినల్ ఫిర్యాదు చేస్తామని బెదిరించారు. భయంతో అతను వారికి ఒకసారి ₹50,000 ఇచ్చాడు, కానీ ఆ తల్లిదండ్రులు ₹5 కోట్లు డిమాండ్ చేశారు. "వారు నన్ను నిరంతరం మానసికంగా వేధిస్తూ, బలవంతం చేస్తున్నారు," అని భగీరథ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై పోక్సో కేసు నమోదు చేస్తామని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు కూడా భగీరథ్ తన ఫిర్యాదులో పేర్కొన్నరు.
Next Story

