ఆసిఫాబాద్ లో పిల్లల అక్రమ రవాణా ముఠా అరెస్ట్
x

ఆసిఫాబాద్ లో పిల్లల అక్రమ రవాణా ముఠా అరెస్ట్

గుజరాత్ పోలీసుల దాడిలో చిక్కిన కింగ్ పిన్ మురుగన్


తీగ లాగితే డొంక కదిలింది. గతంలో మైనర్ బాలుడి కిడ్నాప్ కేసులో గుజరాత్ పోలీసులు దర్యాప్తు చేస్తుండగా పిల్లల అక్రమ రవాణా ముఠా బయట పడింది ఈ ముఠాకి దేశ వ్యాప్తంగా నెట్ వర్క్ ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ముఠా పిల్లల అక్రమ రవాణా కార్యకలాపాలకు పాల్పడుతోంది.తెలుగు రాష్ట్రాల్లో నే కాకుండా గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో ఈ ముఠా పని చేస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ ముఠా సూత్రం ధారి , పాత్ర ధారి నాగరాజు అలియాస్ మురుగన్ ని గురువారం అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెప్పారు. ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఏ ఐ ని వినియోగించి మురుగన్ ని అరెస్ట్ చేశారు మూడు సంతాన సాఫల్య కేంద్రాల్లో మురుగన్ సంబంధాలు పెట్టుకుని పిల్లలను అక్రమ రవాణా చేసినట్టు దర్యాప్తులో బయట పడింది. మురుగన్ గతంలో పిల్లల అక్రమ రవాణాకేసులో అరెస్ట్ అయి జైలుకెళ్లాడు. ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చిన మురుగన్ మళ్లి అదే పని చేయడం ప్రారంభించాడు. పాత దందాను తెరలేపి అనుహ్యంగాపోలీసులకు చిక్కాడు. "ఈ గ్యాంగ్ 10 మంది పిల్లలను కిడ్నాప్ చేసినట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు. పుట్టిన పిల్లలను పిల్లలు లేని దంపతులకు విక్రయించి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నట్టు" పోలిసులు తెలిపారు. నిందితుల నుంచి లక్ష 50 వేలు స్వాధీనం చేసుకున్నారు. మురుగన్ ఇద్దరు ప్రధాన ఏజెంట్లు కాసారపు తిరుపతి, కేలేటి గంగాధర్ లను అరెస్ట్ చేసినట్టు కాగజ్ నగర్ పోలీసులు చెప్పారు. బసాకాంత్ ఎస్ పి ప్రశాంత్ పర్యవేక్షణలో కాగజ్ నగర్ పోలీసుల సహకారంతో మురుగన్ ని అరెస్ట్ చేసినట్టు దర్యాప్తు అధికారులు చెప్పారు.

సృష్టి తర్వాత

నిరుడు సికిందరాబాద్ లో పిల్లల అక్రమ రవాణా కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత తాజాగా మురుగన్ కేసు బయటపడింది. సృష్టి స్కామ్ బయటపడ్డాక ఆంధ్రా యూనివర్సిటీ లో ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ అట్లూరి నమ్రతా అక్రమాలకూ పాల్పడినట్టు తెలిసిందే. ఈ కేసులోనే ఆమె జైలుకెళ్లారు.

మురుగన్ గ్యాంగ్ మొత్తం 8 రాష్ట్రాల్లో పిల్లల అక్రమ రవాణా కార్య కళాపాలాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఒక్కో బిడ్డను 4 నుంచి 6 లక్షల వరకు అమ్మినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. మురుగన్ తో పాటు భార్య కృష్ణవేణిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్ రాష్ట్రంలో బాసకాంత్ జిల్లాలో ఓ చిన్నారి కిడ్నాప్ అయినా నేపథ్యంలో ఈ కేసును దర్యాప్తు చేస్తుండగా తెలంగాణా ఆసిఫాబాద్ లో మురుగన్ గ్యాంగ్ ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. అంతరాష్ట్ర ముఠాలో తెలంగాణ వాసులు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.

Read More
Next Story