
ప్రధాని మోదీతో ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్ లేయన్
‘మదర్ ఆఫ్ ఆల్ డీల్’పై సంతకం చేసిన ప్రధాని మోదీ
ఈయూ- భారత్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు వెల్లడి
భారత్- యూరోపియన్ యూనియన్ దేశాల మధ్య చారితాత్మకమైన వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై సంతకం చేసినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఇది ప్రపంచం జీడీపీలో 25 శాతం, ప్రపంచ వాణిజ్యంలో మూడో వంతు వాటా కలిగి ఉన్నాయి. ఈ ఒప్పందం వల్ల దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు, కోట్లాది మంది యూరోపియన్లకు లాభం చేకూరుతుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
‘‘ఒక పెద్ద పరిణామం గురించి మీకు తెలియజేస్తున్నాను. భారత్, యూరప్ మధ్య సోమవారం ముఖ్యమైన ఒప్పందం జరిగింది. ప్రజలు దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్ గా చెబుతున్నారు. ఈ ఒప్పందం వలన 140 కోట్ల మంది భారతీయులు, కోట్లాది మంది భారతీయులకు చాలా అవకాశాలు తెచ్చిపెడుతుంది’’ అని ఇండియన్ ఎనర్జీ వీక్ ను వర్చువల్ గా ఉద్దేశించిన ప్రసంగంలో ప్రధాని తెలిపారు.
భారత్- ఈయూ మధ్య ఉన్న అద్బుతమైన సహకారానికి ఇది తార్కాణమని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఈ ఒప్పందం ప్రపంచ జీడీపీలో 25 శాతం, ప్రపంచ వాణిజ్యంలో మూడింట ఒక వంతుకు ప్రాతినిధ్యం వహించే దేశాల మధ్య జరిగిందని ఆయన గుర్తు చేశారు.
ఈయూతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం బ్రిటన్, ఇతర యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ తో కుదిరిన ఒప్పందాలకు అనుబంధంగా ఉంటుందని ప్రధాని తెలిపారు.
‘‘ఇది ప్రపంచ వాణిజ్యం, సరఫరా గొలుసులకు బలోపేతం చేస్తుంది’’ అన్నారు. వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, తోలు, బూట్లు వంటి వాటిలో పనిచేస్తున్న వారిని మోదీ అభినందించారు.
ఈ ఒప్పందం కార్మికులకు అనుకూలంగా ఉంటుందని చెప్పారు. భారత్ లో తయారీ రంగాన్ని పెంచడమే కాకుండా సేవల రంగాన్ని విస్తరించడానికి తోడ్పాటు అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రపంచంలోని ప్రతి వ్యాపారికి, పెట్టుబడిదారికి భారత్ పై నమ్మకాన్ని ఎఫ్టీఏ ఒప్పందం మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. అలాగే ఈయూ పలుకుబడిని సైతం ఇంకా పెంచుతుందని పేర్కొన్నారు. ఉమ్మడి ప్రజాస్వామ్య విలువకు ఈ ఒప్పందం తార్కాణమన్నారు.
స్పష్టమైన ప్రయోజనాలు..
పరిశ్రమ రంగాలకు చెందిన ప్రతినిధులను ఉద్దేశిస్తూ మోదీ ప్రసంగిస్తూ.. ఈ ఒప్పందం అన్ని రంగాలకు మేలు చేస్తుందని చెప్పారు. ఈ రంగంలో సంబంధం ఉన్న సహోద్యోగులను కూడా మంచి జరుగుతుందని ఆయన అన్నారు.
‘‘మిత్రులారా ఈ వాణిజ్య ఒప్పందం భారత్ లో తయారీని బలోపేతం చేయడమే కాకుండా, సేవలరంగం మరింత విస్తరణకు సహాయపడుతుంది’’ అని పేర్కొన్నారు.
ఇంధన రంగంలోనూ అపారమైన పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని ప్రధాని మోదీ చెప్పారు. లోతైన సముద్ర అన్వేషణ సంస్కరణలను కూడా ఆయన ప్రస్తావించారు.
‘‘మా లోతైన సముద్ర అన్వేషణ, సంబంధిత సముద్ర మంథన్ మిషన్ గురించి మీకు తెలుసు’’ అని ఆయన అన్నారు. దశాబ్ధం తరువాత భారత్ చమురు, గ్యాస్ రంగ పెట్టుబడిని వంద బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.
Next Story


