అంకితా భండారి హత్య కేసు పై ఇండియా గేట్ వద్ద ఆందోళన
x

అంకితా భండారి హత్య కేసు పై ఇండియా గేట్ వద్ద ఆందోళన

మద్దతు తెలిపిన కాంగ్రెస్, నిందితులకు బీజేపీ రక్షణ కల్పిస్తుందని ఆరోపణ


Click the Play button to hear this message in audio format

ఉత్తరాఖండ్ లోని ఓ హోటల్ లో రిపెన్షనిస్ట్ గా పనిచేసే అంకితా భండారీ హత్య కేసులో న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగిన ఆమె తల్లిదండ్రులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని, అనంతరం విడుదల చేశారు.

సిక్కిం గవర్నర్‌గా బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ నియామకాన్ని నిలిపివేయాలని, అంకితా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు పూర్తయ్యే వరకు ఈ నియామకంపై నిర్ణయం తీసుకోవద్దని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఉత్తరాఖండ్‌లోని ఓ రిసార్ట్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేసిన 19 ఏళ్ల అంకితా భండారీ 2022 సెప్టెంబర్‌లో హత్యకు గురైంది. ఈ కేసులో రిసార్ట్ యజమాని పుల్కిత్ ఆర్యతో పాటు మరో ఇద్దరికి 2025 మేలో కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే, ఈ హత్య వెనుక ఓ వీఐపీ ప్రమేయం ఉందని ఆయనే దుష్యంత్ కుమార్ అని తల్లిదండ్రులు ఆరోపించారు.
ఈ నేపథ్యంలో బుధవారం అంకితా తల్లిదండ్రులు, ఇతర కార్యకర్తలు ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నిరసన చేపట్టారు. ఈ ఆందోళనకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా కూడా మద్దతు తెలిపారు. సీబీఐ విచారణ పూర్తయ్యే వరకు దుష్యంత్ కుమార్ గౌతమ్ గవర్నర్ నియామకాన్ని నిలిపివేయాలని, కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వీఐపీ ఎవరన్నది తేల్చాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.
బుధవారం రాత్రి కొనసాగిన ఈ నిరసనను గురువారం తెల్లవారుజామున పోలీసులు అడ్డుకున్నారు. అంకితా తల్లిదండ్రులతో పాటు కాంగ్రెస్ నేతలు పవన్ ఖేరా, సుప్రియా శ్రీనతే, ఉదయ్ భాను చిబ్ తదితరులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఉదయం ఐదు గంటల సమయంలో అంకితా తల్లిదండ్రులను విడుదల చేశారు.
తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించేందుకు 24 గంటల గడువు ఇస్తున్నట్లు అంకితా తండ్రి ప్రకటించారు. గౌతమ్ నియామకాన్ని నిలిపివేయకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మరోవైపు, నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్న తీరుపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
అంకితా హత్య కేసులో ఇప్పటికే ముగ్గురికి శిక్ష పడినప్పటికీ, వీఐపీ ప్రమేయంపై ఆరోపణల నేపథ్యంలో కుటుంబం మరింత సమగ్ర దర్యాప్తును కోరుతోంది. ఈ అంశంపై ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు తీసుకునే తదుపరి చర్యలపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.
Read More
Next Story