
హుజురాబాద్ డంపింగ్ యార్డు తొలగించాలని నిర్ణయం
గులాబీ పార్టీ, కమలం పార్టీ కలసి పని చేస్తాయా ?
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని బీజేపీ ఉద్యమం చేపట్టింది.కేంద్ర మంత్రి బండి సంజయ్ డంపింగ్ యార్డ్ ఏర్పాటువల్ల ప్రజలు అనారోగ్య పాలవుతారని ఆందోళన వ్యక్తం చేశారు.వాయు కాలుష్యం తో బాటు భూగర్భ జలాలు కలుషిత మవుతాయన్నారు,శుక్రవారం డంపింగ్ యార్డుకి వ్యతిరేకంగా హుజురాబాద్ నియోజక వర్గంలో పర్యటించారు. ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు.
హుజూరాబాద్లో డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఆందోళన బాట పట్టింది. ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షలు, నిరసనలు చేపట్టాలని ఆ పార్టీ నిర్ణయించింది.ఉద్యమ సెగ సర్కార్ ని తాకాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది,డంపింగ్ యార్డు దుర్గంధం రుచి చూపిస్తానని బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరించారు.
డంపింగ్ యార్డుకి వ్యతిరేకంగా బిఆర్ఎస్ అందోళన
కాగా డంపింగ్ యార్డ్ రద్దు అయ్యేవరకు తన పాదయాత్ర ఆగదని హుజురాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. దాదాపు 20 కిలో మీటర్ల వరకు డంపింగ్ యార్డ్ దుర్గంధం వెదజల్లుతుంది ఆని ఆయన ఆరోపించారు. దాని బారిన పడి ప్రజలు రోగాల పాలవుతారన్నారు. పాడి కౌశిక్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్నారు. అవసరమైతే డంపింగ్ యార్డుకి వ్యతిరేకంగా బీజేపీ ఎంపీలుగాఉన్న బండి సంజయ్, ఈటెల రాజెందర్ మద్దతుతో ఆందోళన చేపడుతానని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. చాలారోజులనుంచి కౌశిక్ రెడ్డి ఆందోళన చేస్తున్నప్పటికీ డంపింగ్ యార్డుకి వ్యతిరేకంగా బీజేపీ చెపట్టిన ఆందోళన బాటకి బిఆర్ఎస్ శాసన సభ్యుడు మద్దతు తెలపడంతో ఇరు పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించి కలసి కట్టుగా ఉద్యమించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.రెండు పార్టీలు కలసి కట్టుగా ఉద్యమిస్తాయా అనే అనుమానాలు తలెత్తాయి అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
ఇటు గులాబీ పార్టీ అటు కమలం పార్టీలు పోటాపోటీగా ఆందోళన చేపడుతున్నప్పటికీ పొలిటికల్ మైలు రాయి ఏ పార్టీకి దక్కుతుందో వేచి చూడాలి.
కాగా హైదరాబాద్ లో ప్రధాన చెత్త కుప్ప జవాహార్ నగర్లో ఉంది. దాదాపు 450 ఎకరాలో ఈ చెత్తకుప్ప ఉంది.
ప్రపంచంలో అత్యధిక మీథేన్ ఉద్గారాలను విడుదల చేసే చెత్త కుప్పల్లో జవహార్ నగర్ చెత్త కుప్ప ఒకటి .
ఇక్కడ ప్రతి రోజు 9, 600 టన్నుల చెత్త చేరుతుంది. తెలంగాణా రాజధానిలో ఇంత పెద్ద ఎత్తున చెత్త చేరడం పట్ల పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు,

