
హన్మాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద బీజేపీ చీఫ్
కాంగ్రెస్ సర్కారుపై మండిపాటు
కాంగ్రెస్ సర్కారుపై మండిపాటు
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్ రామ్ చందర్ రావు ఆరోపించారు. గురువారం యాదాద్రి జిల్లా భువనగిరి మండలం హన్మాపూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు.కిసాన్ మోర్చా నాయకులతో కల్సి రాంచందర్ రావు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులు ఎదుర్కొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధత వల్లే అన్న దాతలు రోడ్డున పడ్డారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్ల పక్రియను కాంగ్రెస్ ప్రభుత్వం కుప్ప కూల్చింది అని ఆయన ఆవేదన వ్యక్యం చేశారు.10 రోజులుగా లారీలు రాక కాంటాలు లేక కనీసం టార్పాలిన్లులేక ధాన్యం మొలకెత్తుతున్నా ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయడము లేదని రైతులు రాంచందర్ రావు వద్ద ఏకరువు పెట్టారు.
రైతుల గోస విన్న తర్వాత రామ్ చందర్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.
మిల్లర్ల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం
అన్న దాతలకు మిల్లర్ల వేధింపులు, ప్రభుత్వ వేధింపులు ఎక్కువయ్యాయని తెలంగాణాలో ప్రభుత్వ దమన కాండను రామ్ చందర్ రావు వివరించారు,
నల్లగొండ జిల్లా బచన్నగూడెం ఐకేపీ సెంటర్ ఇంచార్జి కొప్పుల సైదులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్టు రామ్ చందర్ రావు అన్నారు. తన ప్రాణత్యాగం వల్ల సర్కార్ కదిలి వస్తుందని సైదులు ఆత్మహత్యాయత్నం కన్నా ముందు వాంగ్మూలం ఇచ్చిన్నట్టు ఆయన తెలిపారు. తెలంగాణలో రైతుల గోస రోజు రోజుకి దారుణంగా తయారవుతున్నాయని రామ్ చందర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులు అధైర్య పడవద్దని, మోడీ ప్రభుత్వం తెలంగాణా రైతాంగాన్ని ఆదుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు. రైతులకు ఇచ్చిన హామీలలను కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిందని ఆయన విమర్శించారు. కేంద్రం నిధులు ఇస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేయలేదని ఆయన ఫైర్ అయ్యారు.

