
రికార్డు స్థాయిలో పశ్చిమ బెంగాల్ లో పోలింగ్
90 శాతం ఓటింగ్, తమిళనాడు 84 శాతం
పశ్చిమ బెంగాల్ లో జరిగిన తొలిదశ ఎన్నికలు హింసాత్మకంగా ముగిశాయి. సర్ నిర్వహణ, అభ్యర్థులపై దాడులు వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఈసారి జరిగిన ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో 90 పోలింగ్ నమోదు అయింది. రాష్ట్ర ఓటింగ్ చరిత్రలో భారీ స్థాయిలో పోలింగ్ నమోదు కావడం ఇది అసాధారణం. మొదటి దశ ఎన్నికలలో 152 నియోజకవర్గాలలో పోలింగ్ జరిగింది.
సాయంత్రం ఆరు తరువాత పోలింగ్ కేంద్రాలలో ఉన్నవారిని ఓటింగ్ కు అనుమతిస్తున్నారు. మొదటి దశలో 1478 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షిస్తున్నారు. బెంగాల్ లో రెండు పార్టీల మధ్యే ప్రధానంగా పోటీ ఉంది. బీజేపీ- టీఎంసీ మధ్య హోరాహోరీ పోరు జరిగిందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
బెంగాల్ లో ఏ పోలింగ్ కేంద్రాలలో చూసిన భారీ స్థాయిలో క్యూ లైన్లు కనిపించాయి. అత్యధికంగా దినాజ్ పూర్ లో 93.12 శాతం పోలింగ్ జరిగింది. బెంగాల్ లో పింగ్లాలో పోలింగ్ సమయంలో బూత్ ను పర్యవేక్షణ లేకుండా వదిలిపెట్టినందుకు పోలింగ్ సిబ్బందిని ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది.
తమిళనాడులో..
తమిళనాడు వ్యాప్తంగా అసెంబ్లీ పోలింగ్ చాలా ప్రశాంతంగా జరిగింది. 234 స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరిగింది. రాష్ట్రంలో అత్యధికంగా 84 శాతం పోలింగ్ జరిగింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో చాలామంది ప్రముఖులు ఉదయం వేళలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్టాలిన్ పోటీ చేస్తున్న కొలత్తూర్ నియోజకవర్గంలో 83.58 శాతం పోలింగ్ నమోదు అయింది. ప్రతిపక్ష నేత ఎడప్పాడి కే. పళిని స్వామి బరిలో ఉన్న నియోజకవర్గంలో 89.09 శాత, విజయ్ పోటీ చేస్తున్న తిరుచ్చి లో 79 శాతం పోలింగ్ జరిగింది.
అసెంబ్లీ ఎన్నికలలో టీవీకే పార్టీ చీల్చే ఓట్లు అధికార పార్టీకా, ప్రతిపక్ష పార్టీకీ చేటు చేస్తాయా అనే విషయంలో సందిగ్థం కొనసాగుతోంది. రాష్ట్రంలో భారీ స్థాయిలో ఓటింగ్ నమోదు కావడంతో డీఎంకేలో గుబులు పుట్టిస్తోంది. అయితే విశ్లేషకులు మాత్రం యువత భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు రావడంలో ఇది సాధ్యమైందని చెబుతున్నారు. విజయ్ ప్యాక్టర్ వారిని పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చిందని అంటున్నారు. టీవీకే కు దాదాపు 20 శాతం ఓట్ షేర్ లభిస్తుందని చెబుతున్నారు.
Next Story

