
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట
నిర్ధోషిగా తీర్పు చెప్పిన కోర్టు
అమిత్ షా పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి బీజేపీ నాయకుడు విజయ్ మిశ్రా 2018 లో దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నాయకుడు లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని సుల్తాన్ పూర్ కోర్టు సోమవారం నిర్ధోషిగా విడుదల చేసింది.
2018 లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో బెంగళూర్ లో జరిగిన ర్యాలీలో రాహుల్, బీజేపీ అప్పటి జాతీయ అధ్యక్షుడైన అమిత్ షా గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు అయింది. ఈ కేసుపై రాహుల్ గాంధీ 2023 లో కోర్టు ఎదుట హాజరై బెయిల్ పొందారు. ఆయన వ్యాఖ్యలు పరువు నష్టం కిందకు రావని కోర్టు తీర్పు ఇచ్చింది. దీనితో ఆయన నిర్దోషిగా విడుదల అయ్యారు.
కాన్వాయ్ ప్రమాదం..
కోర్టు విచారణ నిమిత్తం సుల్తాన్ పూర్ కు వెళ్తున్న రాహుల్ కాన్వాయ్ లోని కొన్ని వాహానాలు సోమవారం పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వే పై ఢీ కొన్నాయని ఒక పోలీస్ అధికారి తెలిపారు. రాహుల్ క్షేమంగా ఉన్నాడని, పెద్ద గాయాలేవి కాలేదని అధికారి తెలిపారు. ఈ ఘటన స్వల్పమైనదని ఆయన పేర్కొన్నారు.
ఉదయం సుమారు 10.15 గంటలకు కాన్వాయ్ ముందు భాగంలో ఉన్న స్థానిక కాంగ్రెస్ నాయకులకు చెందిన ఒక ప్రయివేట్ వాహనం తెలియని కారణంతో అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో దాని వెనక ఉన్న వాహనాలు ఢీకున్నాయని అధికారి తెలిపారు.
పరువు నష్టం...
మరో కేసులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తాను 2019 లో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి రాహుల్ గతంలో సుప్రీంకోర్టు నుంచి మధ్యంతర ఉపశమనం పొందారు. ఆ విషయంలో విచారణకు నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది.
Next Story

