క్షేత్రస్ధాయిలో కూడా ‘ప్రజావాణి’ వినబడాలి
x

క్షేత్రస్ధాయిలో కూడా ‘ప్రజావాణి’ వినబడాలి

ప్రజాసమస్యల పరిష్కారం కోసం రేవంత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2023, డిసెంబర్ 8వ తేదీన ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం అందరికీ తెలిసిందే


ఇకనుండి ప్రజావాణి కార్యక్రమాన్ని గ్రామస్ధాయికి కూడా విస్తరించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఆదివారం ప్రజావాణి కార్యక్రమం పురోగతిపై రేవంత్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతు ఇకనుండి ప్రజావాణి సేవలను క్షేత్రస్ధాయికి విస్తరించాలని ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కార వ్యవస్ధను పకడ్బందీగా అమలుచేయాలన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం రేవంత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2023, డిసెంబర్ 8వ తేదీన ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం అందరికీ తెలిసిందే. ప్రతి మంగళవారం, శుక్రవారం హైదరాబాద్ లోని ప్రజాభవన్లో ఈ కార్యక్రమం జరుగుతోంది. జిల్లా స్ధాయిలో కూడా వారానికి ఒకరోజు ఈ కార్యక్రమం అమలవుతున్న విషయాన్ని రేవంత్ గుర్తుచేశాడు.

అందుకనే ఈ కార్యక్రమాన్ని రెవిన్యు డివిజన్, మండల కేంద్రాల నుండి గ్రామస్ధాయికి కూడా విస్తరించాలని రేవంత్ డిసైడ్ అయ్యాడు. నిజంగా రేవంత్ ఆదేశాలు అమలై గ్రామస్ధాయిలో కూడా ఈ వ్యవస్ధ ఏర్పాటై సమస్యల పరిష్కారానికి వేదికగా మారితే జనాలకు అంతకన్నా కావాల్సింది ఏముంటుంది ? దూరప్రాంత ప్రజలకు ప్రభుత్వాన్ని చేరువచేయటమే ప్రజావాణి లక్ష్యంగా రేవంత్ వివరించారు. ఫిర్యాదుల పరిష్కారంపై కఠిన ఆదేశాలు జారీచేసినట్లు రేవంత్ గుర్తుచేశారు. అయితే తన ఆదేశాలు ఏమేరకు అమలవుతున్నాయన్న విషయాన్ని రేవంత్ ఫాలో అప్ చేయటం చాలా అవసరం. సమస్యల పరిష్కారంలో జాప్యం జరిగితే అందుకు అదికారులదే బాధ్యతగా రేవంత్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

ఫిర్యాదుల కోసం ఏకీకృత డిజిటల్ ప్లాట్ ఫామ్ ఏర్పాటుచేయాలని కూడా ఆదేశించాడు. రియల్ టైమ్ మానిటరింగ్ వ్యవస్ధ ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పాడు. డ్యాష్ బోర్డ్ ద్వారా కార్యక్రమం అమలు పురోగతిని పర్యవేక్షించాలని రేవంత్ అనుకోవటం కూడా మంచిదే. ప్రతిస్ధాయిలో నోడల్ అధికారులను నియమించబోతున్నామని, ప్రతి జిల్లా, శాకల్లో ప్రజావాణి విభాగాలను ఏర్పాటు చేస్తామని కూడా చెప్పాడు. పనిలోపనిగా సమస్య ఒకస్ధాయిలో పరిష్కారం కాకపోతే ఆటో ఎస్కలేషన్ ఏర్పాటు చేసి పై స్ధాయిలో పరిష్కారమయ్యేట్లు చేయబోతున్నామన్నాడు. అవసరమైతే అప్పీల్ వ్యవస్ధను కూడా ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు రేవంత్ తెలిపాడు. క్రమంతప్పకుండా ప్రజావాణిలో సమస్యల పరిష్కారంపై సమీక్షలు నిర్వహించాలని ఉన్నతాధికారులను ఆదేశించాడు.

Read More
Next Story