మొబైల్ వ్యసనం వల్ల పెరిగిపోతున్న మానసిక సమస్యలు
కుటుంబ సంబంధాలు దెబ్బతింటున్నాయని, మానసిక సమస్యలు పెరిగిపోతున్నాయన్నవే ఎక్కువగా ఉన్నాయని రోష్ని మాజీ డైరెక్టర్, సీనియర్ కౌన్సిలర్ మాలతి చెప్పారు.
మనుషుల్లో మొబైల్ ఫోన్ వాడకం వల్ల సమస్యలు పెరిగిపోతున్నాయి. మనిషి సృష్టించిన మొబైల్ ఫొన్ చేతిలో చివరకు మనిషే ఇరుక్కుపోయాడు. ఫలితంగా మొబైల్‌ఫోన్ వాడకంలో వ్యసనపరులైన మనుషుల్లో మానసిక సమస్యలు పెరిగిపోతున్నాయి. ఈ విషయమై ఈమధ్యనే రోష్ని స్వచ్చంధ సంస్ధ చేసిన సర్వేలో అనేక విషయాలు వెలుగుచూశాయి.
రోష్నికి ప్రతిరోజు వస్తున్న ఫిర్యాదుల్లో కుటుంబ సంబంధాలు దెబ్బతింటున్నాయని, మానసిక సమస్యలు పెరిగిపోతున్నాయన్నవే ఎక్కువగా ఉన్నాయని రోష్ని మాజీ డైరెక్టర్, సీనియర్ కౌన్సిలర్ మాలతి చెప్పారు. 2025లో రోష్నికి వచ్చిన సుమారు 6వేల ఫిర్యాదుల్లో అత్యధికం 4వేలమంది పురుషుల్లో మానసికసమస్యలు పెరిగిపోతున్న విషయం బయటపడినట్లు కౌన్సిలర్ తెలిపారు.
మహిళల్లో సుమారు 1500 మంది వివిధ రకరకాల సమస్యలతో ఇబ్బందిపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. కౌన్సిలింగ్ కోసం తమకు ఫోన్ చేస్తున్న వాళ్ళల్లో టీనేజ్ వయసు వాళ్ళే ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ఒకేఇంట్లో ఉంటున్న కుటుంబసభ్యులు కూడా నేరుగా కూర్చుని మాట్లాడుకోవటం మానేసి మొబైల్ ఫోన్ తోనే ఎక్కువ గంటలు గడుపుతున్నట్లు ఆవేధన వ్యక్తంచేశారు. మొబైల్ వాడకానికి బానిసలు అయిపోవటం వల్లే చాలామందిలో మానసికసమస్యలు పెరిగిపోతున్నాయన్నారు.

