ఆర్టీసీ డ్రైవర్ మృతితో ముత్తోజి పేట ఉద్రిక్తం
x
ముత్తోజు పేటలో కేంద్ర మంత్రి బండి సంజయ్

ఆర్టీసీ డ్రైవర్ మృతితో ముత్తోజి పేట ఉద్రిక్తం

ఆర్టీసీ సమ్మె వేడెక్కింది. బీజేపీ మద్దతు, కార్మికుల ఆందోళనలు, ప్రభుత్వ చర్చలు—పరిస్థితి ఉత్కంఠగా మారింది.


ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మ హత్య నేపథ్యంలో వరంగల్ జిల్లా ముత్తోజిపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది . నర్సంపేట డిపోలో సుదీర్ఘ కాలం పని చేసిన శంకర్ గౌడ్ మృతదేహాన్ని చూడటానికి ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ముత్తోజిపేటకు తరలివస్తున్నారు.ముత్తోజి పేటలో ఉద్రిక్త వాతావరణం తలెత్తకుండా పోలీసులు ఎక్కడికక్కక్కడే

ఆందోళన కారులను అడ్డుకున్నారు . కరీంనగర్ నుంచి వరంగల్ బయలుదేరిన కేంద్ర మంత్రి బండిసంజయ్ శంకర్ గౌడ్ మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.శంకర్ గౌడ్ కి స్వంత ఇల్లు లేకపోవడముతో శంకర్ గౌడ్ కూతురు ఇంట్లో భౌతిక కాయాన్ని ఉంచారు. బండి సంజయ్ రాగానే మృతదేహాన్ని ముత్తోజి పేట బస్టాండ్ తీసుకు వెళతామని ఆర్ టీసీ కార్మికులు పట్టు పట్టడంతో అక్కడ దాదాపు రెండు గంటలు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.బండి సంజయ్ , ఆర్టీసీ కార్మికుల చేత అధికారులు చర్చలు జరిపారు.వారిని సముదాయించడానికి అధికారులు ప్రయత్నించారు. మృతదేహంతో రోడ్డుపై బండి సంజయ్ బైఠాయించారు.

ప్రభుత్వ హత్య

ఆర్ టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ఆత్మా హత్యకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని మాజీ మంత్రి , బీఆర్ఎస్ నేత ఎర్రవెల్లి దయాకర్ రావు అన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్య అని ఆయన అభివర్ణించారు. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం ముందే చర్చలు జరిపినట్లయితే శంకర్ గౌడ్ ఆత్మా హత్య జరిగి ఉండేది కాదని ఆయన అన్నారు.

10 లక్షల ఎక్సగ్రేషియా

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఆయన కుమారుడికి ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

Read More
Next Story