
సరస్వతీ అంత్య పుష్కరాల పోస్టరును ఆవిష్కరిస్తున్న మంత్రులు కొండా సురేఖ, డి శ్రీధర్ బాబు, అధికారులు
మే 21 నుంచి సరస్వతీ అంత్య పుష్కరాలు
రూ.30 కోట్లతో అభివృద్ధి పనులు
సరస్వతీ అంత్య పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. సచివాలయంలోని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి డి. శ్రీధర్ బాబు తో కలసి సరస్వతి అంత్య పుష్కరాలు పోస్టర్, అధికారిక టీజర్‌ను బుధవారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, ఈ సరస్వతీ అంత్య పుష్కరాలను మే 21 నుంచి జూన్ 1 వరకు 12 రోజుల పాటు కాళేశ్వరంలో నిర్వహిస్తున్నామన్నారు.
రూ.30 కోట్లతో అభివృద్ధి పనులు
పుష్కరాలకు రూ.30.63 కోట్లతో 162 అభివృద్ధి పనులను చేపట్టామని మంత్రి కొండా సురేఖ చెప్పారు. భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తామని ,ప్రశాంత వాతావరణంలో భక్తులు పుష్కర స్నానం, స్వామి దర్శనం చేసుకొనే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు.
అంత్య పుష్కరాలకు 30 లక్షల భక్తులు
ఈ అంత్య పుష్కరాలకు 30 లక్షల భక్తులు ఈ పుష్కరాలకు వస్తారని అంచనా వేస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సరస్వతి ఆది పుష్కరాలు మే 15, 2025 నుంచి మే 26, 2025), సమ్మక సారలమ్మ జాతర నిర్వహణకు అవకాశం వచ్చిందని, వీటిని అత్యంత ఘనంగా నిర్వహించామన్నారు. ఇప్పుడు సరస్వతి అంత్య పుష్కరాలు, వచ్చే సంవత్సరం రానున్న గోదావరి పుష్కరాలకు కూడా పనులను కూడా ప్రారంభించామని తెలిపారు.
రూ.198 కోట్లతో కాళేశ్వరం దేవస్థానం అభివృద్ధి
సరస్వతీ పుష్కరాలను భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి డి. శ్రీధర్ బాబు కోరారు. 10 రోజుల ముందే పుష్కరాల పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ సమస్య కలగకుండా పోలీసు యంత్రాంగం, ఇతర శాఖల సమన్వయంతో పని చేయాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి పుష్కరాలను విజయవంతం చేయాలని కోరారు. కాళేశ్వరం దేవస్థానం పునర్నిర్మాణానికి రూ.198 కోట్లను కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మత్రి కృతజ్ఝతలు తెలిపారు.
పుష్కర స్నానానికి కంచికామకోటి పీఠాధిపతి
దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ మాట్లాడుతూ, ఈ పుష్కరాలను మే 21 నుంచి జూన్ 1 వరకు 12 రోజుల పాటు కాళేశ్వరంలో నిర్వహిస్తున్నామన్నారు. పుష్కరాల మొదటి రోజు ఉదయం 5 గంటల 43 నిమిషాలకు ప్రారంభ పుష్కర స్నానాన్ని కంచికామకోటి పీఠాధిపతి శంకర విజేంద్ర సరస్వతీ స్వామి చేస్తారని తెలిపారు. రాష్ట్ర గవర్నర్ ను ఆహ్వానించామని తెలిపారు. ప్రతి రోజు ఒక పీఠాధిపతి ఉదయం పుష్కర స్నానం చేసే విధంగా ఏర్పాట్లు చేశామని అన్నారు. ప్రతి రోజు త్రివేణి సంగమం వద్ద సాయంత్రం 6.30 ఘనంగా కాశి పండిట్ లు హారతి నిర్వహిస్తారని తెలిపారు.
Next Story

