
మైక్రో ఫైనాన్స్ కేసులో మంగ్లీ సోదరుడి పేరు..
సింగర్ మంగ్లీ పేరు వినిపించిన మైక్రో ఫైనాన్స్ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇందులో తనకు ఎటువంటి సంబంధం లేదని మంగ్లీ చెప్తున్నారు. కాగా తాజాగా ఈ కేసులో పోలీసులకు కీలక విషయం కనుగొన్నారు. వారి విచారణ ఆధారంగా ఈ కేసులో మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ హస్తం కూడా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రమావత్ మధు.. శివ బ్యాంక్ అకౌంట్‌కు డబ్బులు పంపినట్లు పోలీసులు గుర్తించారు. డబ్బులు పడినవి పడినట్లు ఆరోజే విత్ డ్రా చేసేవారని కూడా పోలీసులు నిర్ధారించారు. కాగా అసలు మధు, శివ మధ్య జరిగిన లావాదేవీల మొత్తం ఎంత అనేది ఇంకా తేలలేదు.
అయితే ఈ కేసుకు తమకు సంబంధం లేదని, తమ పేర్లను అనవసరంగా కలుపుతున్నారని మంగ్లీ, ఆమె సోదరుడు అంటున్నారు. కానీ నిందితుడు మధు మాత్రం మంగ్లీకి, ఆమె సోదరిడికి కూడా కేసులో భాగస్వామ్యం ఉన్నట్లు చెప్తున్నారు. అయితే ఈ మైక్రో ఫైనాన్స్ పేరుతో సామాన్యుల నుంచి వందల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

