
సర్ వివాదం: ప్రతిపక్షాలు దాఖలు చేసిన పిటిషన్ లో లోపాలు
నిన్న సాయంత్రం సుప్రీంకోర్టు వరకూ మార్చ్ నిర్వహించిన విపక్షాలు
ఓటర్లను తొలగిస్తున్నా ఇండి కూటమి హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై నిన్న పాదయాత్ర నిర్వహించిన విపక్షాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. అయితే ఈ పిటిషన్ లో దాదాపు పది లోపాలు ఉన్నాయాని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ గుర్తించింది.
ఈ కేసులో సహ పిటిషనర్లలో ఒకరైన కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, గుర్తింపు కార్డు పేరు మీద స్పష్టమైన కాపీని సమర్పించాలని రిజిస్ట్రీ, పైలింగ్ లాయర్ ను కోరింది.
పిటిషన్ లో కొన్ని పేరాలు అస్పష్టంగా, లింక్ మిస్ అయినట్లు ఉన్నాయని కూడా రిజిస్ట్రీ గుర్తించింది. అంతేకాకుండా కోర్టుఫీజును కూడా చెల్లించలేదని తేలింది. నిన్న సాయంత్రం రాహుల్ తో పాటు పలువురు ప్రతిపక్ష నాయకులు పిటిషన్ దాఖలు చేయడానికి సుప్రీంకోర్టు వరకూ పాదయాత్ర చేశారు.
సర్ సమయంలో తొలగించిన ఓట్లపై స్వతంత్య్ర ఆడిట్ నిర్వహించాలని, విశ్రాంతి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో సాంకేతిక నిఫుణులు, ఇతర ప్రముఖ పౌరుల సాయంతో విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని వారు పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు.
నేడు తేనీటి విందు..
ఈ వివాదంపై మంగళవారం ఇండి కూటమిలోని నేతలకు తేనేటీ విందు ఇవ్వనున్నారు. వీరితో పాటు పౌర సమాజ సభ్యులు, విద్యార్థి సంఘాలను ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరారు. మొదట మధ్యాహ్నం ఇండి కూటమి ఎంపీల పత్రికా సమావేశం జరుగుతుందని తెలిపారు. సాయంత్రం ఐదు గంటలకు గాంధీ నివాసమైన నెంబర్ 5, సునేహ్రీ భాగ్ రోడ్ లో తేనీరు ఏర్పాటు చేస్తారు.
‘‘ఈ రోజు జరిగిన ప్రజాస్వామ్య యాత్ర, వినతిపత్రం సమర్పణ అనంతరం.. నేటీ మధ్యాహ్నం ఇండి కూటమి నేతల పత్రికా సమావేశం, అనంతరం తేనీరు ఏర్పాటు చేయబడింది.. అక్టోబర్ 13, మంగళవారం సాయంత్రం 4 గంటలకు న్యూఢిల్లీ లోని సునేహ్రీ భాగ్ రోడ్ లోని నా నివాసం నాతో పాటు హాజరు కావాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
Next Story

