చిరు హోటళ్ల వ్యాపారులు హాస్టల్ లను ఇక్కట్ల పాలు చేయనున్న గ్యాస్ బండ ధర
x

చిరు హోటళ్ల వ్యాపారులు హాస్టల్ లను ఇక్కట్ల పాలు చేయనున్న గ్యాస్ బండ ధర

ధరల పెరుగుదల తరువాత హైదరాబాద్ లో 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రు. 3,337


కేంద్ర ప్రభుత్వం పెంచిన కమర్షియల్ గ్యాస్ ధరలు ఇప్పటికే కష్టాల్లో ఉన్న తమ వ్యాపారంపై మూలిగే నక్క పై తాటికాయ పడ్డ చందంగా ఉందని జంట నగరాల్లోని చిరు హోటళ్ల వ్యాపారులు హాస్టల్ యజమానులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే గల్ఫ్ లో యుద్ధం మొదలైయ్యాక ఖర్చులు పెరిగాయని దీని వలన తాము వ్యాపారం చేయలేని పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు.

ధరల పెరుగుదల తరువాత హైదరాబాద్ లో 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రు. 3,337 కు చేరింది. దీని వలన బ్లాక్ లో సిలిండర్ ధర దాదాపు మూడు రెట్లు పెరుగుతాయని అమీర్‌పేట్ లో శివ సాయి టి పాయింట్ నడిపే ఎం. ప్రసాద్ తెలిపారు. “టి రేట్ పెంచలేము. ఈ ధర పెరుగుదలతో మా లాభంలో 60 శాతం వరకు కోత పడుతుంది. కస్టమర్ లు ఇప్పటికే తగ్గిపోయారు. కొందరు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడంతో దాని ప్రభావం ఇప్పటికే ఉంది. ఎవరిని పనికి పెట్టుకోకుండా సొంతంగా చేస్తున్న వ్యాపారం కాబట్టి ప్రస్తుతానికి నెట్టుకొస్తున్నాము,” అని చెప్పారు.

ఇక జార్ఖండ్ కు చెందిన జస్వంత్ కుమార్ యుద్ధం మొదలైయ్యాక ఇంటికి డబ్బులు పంపలేకపోతున్నానని ఆవేదనతో చెప్పారు. పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. అమీర్‌పేట్ లోనే బెనితా కోలకతా రోల్స్ అండ్ మాగ్గీ నడిపే తాను హైదరాబాద్ లో ఇతర కార్మికులతో కలిసి ఉండటానికి, తన కొట్టు ఉన్న స్థలానికి అద్దె చెల్లించటానికే తన ఆదాయం సరిపోతోందని తెలిపారు.

ఇక పోతే ఐటీ కారిడార్ లోని హాస్టల్ ల అసోసియేషన్ కోశాధికారి వీ. మహీధర్ మాట్లాడుతూ సిలిండర్ పై పెరిగిన రు. 993 వలన నెలకు కనీసం రు. 16,000 వరకు భారం పడుతుందని తెలిపారు. “కమర్షియల్ సిలిండర్ ధరలు ప్రతినెలా మొదటి తారీఖు నిర్ణయం అవుతాయి. సాధారణంగా రు. 20 నుంచి 30 వరకు పెరుగుతాయి. బల్క్ లో కొనే రెగ్యులర్ కొనుగోలుదారులకు డీలర్ లు డిస్కౌంట్ ఇస్తారు. ఈ ఏడు జనవరి లో రు. 1995 ఉన్న సిలిండర్ ఫిబ్రవరి లో రు. 2053, మార్చి లో కొంత తగ్గి రు. 1992 కు వచ్చింది. దానిపై డీలర్ మాకు రు. 200 డిస్కౌంట్ ఇచ్చారు. అదే సిలిండర్ ధర ఇప్పుడు రు. 3,337 కు చేరింది. డీలర్ డిస్కౌంట్ కూడా ఇవ్వలేదు,” అని తెలిపారు.

పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్ చార్జీలు పెరుగుతాయా అంటే మార్కెట్ లో ఆ పరిస్థితి లేదని ఆయన అన్నారు. చాలా హాస్టలు 80 శాతం మాత్రమే భర్తీ అయ్యాయని, ఏఐ ప్రభావంతో రిక్రూట్మెంట్ తగ్గటం, కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వటంతో పాటు ఉద్యోగుల తొలగింపు ప్రభావం ఉందని తెలిపారు.

“వ్యాపారంలో పోటీ ఉంది. అన్ని సౌకర్యాలు ఉండే కొన్ని ఏ గ్రేడ్ హాస్టల్ లు తప్ప 90 శాతం పెంచలేరు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత ధరలు పెరుగుతాయి అని ఊహించాము. గ్యాస్ సిలిండర్ సరఫరా సరిపడా లేకపోవటం వలన చాలా మంది బ్లాక్ లో కొంటున్నారు. 100 మంది ఉన్న హాస్టల్ కు వారానికి నాలుగు సిలిండర్ లు అవసరం అయితే రెండే డీలర్ ల నుండి వస్తున్నాయి. కూరగాయల ధరలు 25 శాతం పెరిగాయి,” అని ఆయన చెప్పారు.

పెద్ద హాస్టల్ లు తప్ప చిన్న హాస్టల్ వాళ్ళు స్థల భావం వలన కట్టెల పొయ్యి పెట్టే పరిస్థితి లేదు. కాబట్టి ఎక్కువ ధర పెట్టి అయినా గ్యాస్ కొనక తప్పదు. హాస్టల్ లు ఏవీ మూత పడలేదు కానీ కొన్ని రోజులు రోటీ లాంటి ఐటమ్స్ తగ్గించామని ‘ఫెడరల్’ తో మాట్లాడిన వివిధ ప్రాంతాలలోని హాస్టల్ యజమానులు తెలిపారు. అయితే నార్త్ ఇండియన్స్ తో పాటు స్థానికులు కూడా రోటీ లాంటి ఐటమ్స్ కోరుకోవటంతో అధిక ధరలకు గ్యాస్ కొనక తప్పని పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

ఐటీ కంపెనీలు తమను సంప్రదించి ఉద్యోగులు కోరుకున్నా వర్క్ ఫ్రమ్ హోమ్ ను అరికట్టాయని మహీధర్ తెలిపారు. మెనూ లో అన్నీ పెడుతున్నామని సాధారణ స్థితికి చేరుకుందని వాళ్ళకు చెప్పాము, అని అమరనాథ్ అనే మరో హాస్టల్ యజమాని అన్నారు.

బ్లాక్ మార్కెట్ లో సిలిండర్ ల అమ్మకం గురించి సందీప్తి గ్యాస్ ఏజెన్సీ లో పార్ట్‌నర్ పి.సీ. నాయుడు మాట్లాడుతూ, “మా రెగ్యులర్ కస్టమర్ లకే సిలిండర్ లు సరఫరా చేయలేకపోతున్నాము. బ్లాక్ లో అమ్మకం గురించి మీడియాలో చూస్తున్నాము. నాలుగు సిలిండర్ లు అవసరం అయ్యే వారికి రెండు మాత్రమే ఇవ్వగలుగుతున్నాము,” అని తెలిపారు.

Read More
Next Story