సుప్రీంకోర్టును ఆశ్రయించిన ‘తెహల్కా’ తేజ్ పాల్
x
తరుణ్ తేజ్ పాల్

సుప్రీంకోర్టును ఆశ్రయించిన ‘తెహల్కా’ తేజ్ పాల్

లైంగిక వేధింపుల కేసులో పది ఏళ్ల శిక్ష విధించిన బాంబే హైకోర్టు


Click the Play button to hear this message in audio format

2013 నాటి లైంగిక వేధింపుల కేసులో పది ఏళ్ల జైలు శిక్ష ప్రకటించిన బాంబే హైకోర్టు తీర్పుపై జర్నలిస్ట్ తరుణ్ తేజ్ పాల్ గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బాంబే హైకోర్టు ఆగష్టు 6న తేజ్ పాల్ ను దోషిగా నిర్ధారించింది.

దీనితో ఆయన న్యాయవాదీ ఆదిత్య సమద్దార్ ఈ అప్పీల్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి తెహెల్కా మాజీ సంపాదకుడికి కఠిన శిక్ష విధించాలని కోరతూ గోవా ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఐదు సంవత్సరాల క్రితం ట్రయల్ కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. అయితే బాంబే హైకోర్టు దీన్ని రద్దు చేసి, అత్యాచారం కేసులో దోషిగా తేల్చింది. ఆయనకు పది సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

కేసు ఏంటీ..

2013 లో గోవాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఒక హోటల్ లిప్ట్ లో తన జూనియర్ అయిన ఉద్యోగిపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఈ కేసులో ఆయన దోషిగా తేలారు. అంతకుముందు తనను తాను వృద్ధుడిగా, రాజకీయ బాధితుడిగా వాదించుకున్నాడు.
తన తీర్పులో హైకోర్టు ట్రయల్ కోర్టు 2021 నాటి ఉత్తర్వును విపరీతమైనదిగా అభివర్ణించింది. రెండువారాల్లోగా తేజ్ పాల్ లొంగిపోవాలని హైకోర్టు తేజ్ పాల్ ను కోరింది. అయితే న్యాయవాదుల అభ్యర్థనతో దీన్ని నాలుగు వారాలకు పెంచింది.

ట్రయల్ కోర్టుపై ఆగ్రహం..

హైకోర్టు ట్రయల్ కోర్టుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితురాలి క్రాస్ ఎగ్జామిన్ సమయంలో తన వ్యక్తిగత జీవితం పై దృష్టి పెట్టడంపై ఆక్షేపించింది. ఆమెను అవమానిస్తుంటే కోర్టును మౌనంగా ఉండడం అది ఆమోదించినట్లే అని పేర్కొంది.
తేజ్ పాల్ పై ఐపీసీ సెక్షన్ లోని 376(2), ఎఫ్, 354(ఏ), 354(బీ), 376(2)(ఎఫ్) కింద కేసులు నమోదు అయ్యాయి. తేజ్ పాల్ తాను ఒక రాజకీయ బాధితుడు అని ఇద్దరు కుమార్తెల తండ్రి అని పేర్కొంటూ తనపై కనికరం చూపాలి వేడుకున్నారు. కానీ ఆయన వాదనలు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వ్యతిరేకిస్తూ ఇలాంటి నిందితులకు కఠిన శిక్ష విధించాలని కోర్టును కోరారు.


Read More
Next Story