
అత్యవసర సేవలకు కొత్త నెంబర్.. 100కు గుడ్‌బై
ఒకపై అన్ని సేవలు ఒక్క కాల్‌తో దరిచేరతాయి.
ఇప్పటి వరకు అత్యవసర సేవల కోసం అంతా డైల్ 100 చేసేవారు. కానీ ఇకపై ఈ నెంబర్ మారిపోనుంది. ఈ నెంబర్‌ను మార్చి 100 స్థానంలో 112 నెంబర్ తీసుకొచ్చినట్లు డీజీపీ సీవీ ఆనంద్ అధికారికంగా ప్రకటించారు. ఇకపై పోలీస్, అంబులెన్స్, అగ్నిమాపక సేవలు ఇలా అన్ని రకాల అత్యవసర సేవలకు ఒకే నెంబర్ వినియోగించనున్నట్లు యాన వెల్లడించారు. ఇంత కాలం పోలీసుల సహాయానికి ఒక నెంబర్, అంబులెన్స్‌కు మరో నెంబర్, ఇలా రకరకాల నెంబర్లు ఉన్నాయని, కానీ ఇకపై అన్నింటికీ ఒకే నెంబర్ ఉంటుందని ఆయన తెలిపారు. తాజాగా దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ డైట్-112ను తెలంగాణలో కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు డీజీపీ తెలిపారు. అత్యవసర సమయంలో ప్రజలకు 112 ఒక్క నెంబర్‌కు కాల్ చేస్తే.. వాళ్లకు కావాల్సిన సేవలను వెంటనే అందించేలా వ్యవస్థను రూపొందించినట్లు ఆయన తెలిపారు.
అయితే దేశవ్యాప్తంగా అన్ని అత్యవసర సేవలకు ఒకే నెంబర్ అన్న సిస్టమ్‌ను కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రవేశపెట్టింది. తొలుత ఈ నెంబర్‌ను 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లాంచ్ చేశారు. ఈ సిస్టమ్‌ను లాంచ్ చేసిన సమయంలోనే అప్పటి హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ప్రజల రక్ష కోసం తాము ఈ మార్పు తీసుకొచ్చామని, రానున్న రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో దీనిని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.
కాగా 2024 డిసెంబర్‌లో ఈ సిస్టమ్ తెలంగాణలో స్టార్ట్ అయింది. కాగా తొలినాళ్లలో బంజారాహిల్స్ నుంచి ఈ సపోర్ట్ సిస్టమ్ కార్యకలాపాలను సాగించారు. 30 మే 2026న సుప్రీంకోర్టు.. దేశంలోని ప్రతి రాష్ట్రం అన్ని అత్యవసర సేవలకు ఒకే హెల్ప్‌లైన్ 112 నెట్వర్క్‌ను వినియోగించాలని, ఈ మార్పు 3 నెలల్లోగా జరగాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ఈ వ్యవస్థను అధికారికంగా ప్రారంభించారు.

