
తెలంగాణ కులాల్లో ఇంగ్లీష్ మీడియం మోజు ఎలా ఉందంటే...
పద్మసాలీయులు ఇంగ్లీష్ మీడియం కోరుకుంటే ముదిరాజ్ కులం ఇందులో వెనకవడి ఉంది...
విద్య, వైద్యం.. ఇది ప్రతి మనిషికి అందాలి. దీనిని ఎవరూ కాదనలేరు. గతంలో అంటే రాజుల పాలన వల్లనో, కులాల ఆధిపత్యం వల్లనో చాలా మందికి ఈ కనీస, మౌలిక వసతులు దూరమయ్యాయి. కానీ ఇప్పుడు దేశంలో ప్రజాస్వామ్య పాలన ఉన్నా.. చాలా మందికి విద్య, వైద్యం విషయంలో కులం కీలక పాత్ర వహిస్తూ ఉంది. తెలంగాణలో ఈనాటికి కూడా ఒక వ్యక్తి చదువును అతను పుట్టిన కులం సాంస్కృతిక స్థాయిన బట్టిఉంటున్నది. కానీ తాజా విడుదలైన SEEEPC సర్వే అదే నిజమని చెప్తోంది. పుట్టిన కులాన్ని బట్టే ఒక విద్యార్థి చదువు ఆధారపడి ఉంటుందని వివరించింది. రాష్ట్రంలో ఇటీవల చేసిన కుల సర్వే ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఒక
ఈ సర్వే ప్రకారం.. సాంస్కృతిక ముందుకు వచ్చినకులాలు తమ పిల్లలకు ఏ చదువు కావాలో కచ్చితంగా అంచనా వేయగలుగుతున్నాయి. సాంస్కృతికంగా వెనకబడిన కులాలు చదువు,బోధనా భాష ఎంపిక విషయంలో వెనబడే ఉన్నాయి.
కొలం తండాలో పుట్టిన పిల్లాడి కంటే బ్రాహ్మణ కులంలో పుట్టిన పిల్లాడు ఇంగ్లీషు మీడియం స్కూల్‌లో చదివే అవకాశాలు 7శాతం అధికంగా ఉన్నాయి. కంసాలి, పద్మసాలి పిల్లలు చాలా వరకు ఇంగ్లీమీడియం స్కూల్‌లో చదువుతుంటే, ముదిరాజ్ పిల్లలు అలా చదవలేకున్నారు. జనరల్ కులాల యువకుల్లో మూడు శాతం మంది డిప్లొమా, డిగ్రీ హోల్డర్స్‌గా ఉంటే.. షెడ్యూల్‌డ్ ట్రైబ్స్‌లో మాత్రం ప్రతి నలుగురిలో ఒకరికే డిగ్రీ, డిప్లొమా వంటివి ఉంటున్నాయి.
3.55 కోట్ల మందిపై సేకరించిన ఈ డేటాను 2025 మార్చిలో ఏర్పాటు చేసిన నిపుణుల బృందం విశ్లేషించింది. మొత్తం 242 కులాలపై ఈ అధ్యయనం జరగగా, విద్యలో కులమే ప్రధాన నిర్ణయకంగా కొనసాగుతోందని నివేదిక స్పష్టం చేసింది. విద్యార్హతల్లో కూడా స్పష్టమైన తేడాలు కనిపించాయి. రాష్ట్రంలో 30 ఏళ్లలోపు వారిలో 36.3 శాతం మంది డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసినప్పటికీ, సాధారణ కులాల్లో ఇది 59 శాతానికి చేరింది. గిరిజనుల్లో మాత్రం ఈ సంఖ్య 28.4 శాతంగా ఉంది. ప్రముఖ కులాల పరిశీలనలో కొమటి, వెలమ, బ్రాహ్మణ కులాలు ఉన్నత విద్యలో ముందంజలో ఉండగా, కొలం తెగలో ఇది కేవలం 4.4 శాతమే నమోదైంది. బేడా, గోండ్, మాలి వంటి కులాలు కూడా వెనుకబడి ఉన్నట్లు తేలింది.
ఇంటర్ వరకు చదివి ఆగిపోవడం ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో ఎక్కువగా కనిపించింది. ఈ వర్గాల్లో విద్య 12వ తరగతి వద్దే ఆగిపోతుందని నివేదిక పేర్కొంది. పాఠశాల విడిచిపెట్టే పిల్లల సంఖ్యలో కూడా పెద్ద తేడా ఉంది. కొలం తెగలో డ్రాప్‌ఔట్ రేటు 5.4 శాతం కాగా, బ్రాహ్మణుల్లో అది కేవలం 1.1 శాతంగా ఉంది. గిరిజన ప్రాంతాల్లో పాఠశాలల కొరత, ఆర్థిక ఇబ్బందులు, సాంస్కృతిక అడ్డంకులు దీనికి కారణమని నివేదిక తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 4.1 శాతం పిల్లలు అక్షరాస్యత లేనివారిగా ఉన్నారు. ఇందులో కొలం తెగలో ఇది 9.3 శాతంగా నమోదైంది.
ప్రైవేట్ పాఠశాలల విషయంలో కూడా భారీ వ్యత్యాసం ఉంది. రాష్ట్రంలో 19.3 శాతం మంది మాత్రమే ప్రైవేట్ స్కూళ్లలో చదివితే, సాధారణ కులాల్లో ఇది 30 శాతం ఉంది. ఎస్సీల్లో 9.6 శాతం, ఎస్టీల్లో 7.8 శాతం మాత్రమే ప్రైవేట్ విద్య అందుకుంది. కొలం పిల్లల్లో ఇది కేవలం 1.1 శాతం. ఇంగ్లీష్ మీడియం విద్యలో కూడా అంతరం స్పష్టంగా కనిపించింది. బ్రాహ్మణుల్లో 72.4 శాతం మంది ఇంగ్లీష్ మీడియంలో చదివినప్పటికీ, కొలం తెగలో అది 10.7 శాతం మాత్రమే. బీసీ వర్గాల్లో కూడా గోల్డ్‌స్మిత్, పద్మశాలి కులాలు ముందుండగా, ముదిరాజ్ వంటి కులాలు వెనుకబడ్డాయి.
మహిళల పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. రాష్ట్రంలో 65.5 శాతం మహిళలు 10వ తరగతి కంటే తక్కువ విద్య మాత్రమే పొందారు. కొలం మహిళల్లో 82.9 శాతం ప్రాథమిక విద్యకే పరిమితమయ్యారు. ఈ సర్వేలో బాల్యవివాహాలు కూడా పరిశీలించబడ్డాయి. గంగిరెద్దలవారు వర్గంలో ఇది అత్యధికంగా ఉండగా, కాపు వర్గంలో అత్యల్పంగా నమోదైంది.

