x

ఇజ్రాయెల్ బాట పడుతున్న యువత

ట్యామ్ కామ్ ద్వారా సుమారు 14,509 మంది 16 దేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కించుకున్నారు.


తెలంగాణ యువత ఈమధ్య కాలంలో ఎక్కువగా ఇజ్రాయెల్ బాట పడుతున్నారు. ఇరాన్ తో పాటు చుట్టుపక్కలున్న కొన్ని దేశాలతో ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. అందుకనే ఆ దేశంలో టెక్నికల్ లేబర్ కొరత బాగా పట్టిపీడిస్తోంది. ఆ కొరతను భర్తీ చేయటం కోసమే తెలంగాణ యువత అక్కడికి వెళుతున్నారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్(ట్యామ్ కామ్) లెక్కల ప్రకారమే ఈ ఏడాదిలోనే సుమారు 2500 మంది ఇజ్రాయెల్ కు వెళ్ళారు.

గల్ఫ్, ఆఫ్రికా దేశాలతో పాటు ఇతర యూరోపియన్ దేశాలకు తెలంగాణ నుండి ఉద్యోగ, ఉపాధికి వెళ్ళదలచిన వాళ్ళకు అవసరమైన నైపుణ్య శిక్షణ అందించటంతో పాటు పాస్ పోర్ట్, వీసా, ఆయా దేశాల్లో ప్లేస్ మెంట్ అందించటమే ట్యామ్ కామ్ లక్ష్యం. ఇప్పటివరకు ట్యామ్ కామ్ ద్వారా సుమారు 14,509 మంది 16 దేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కించుకున్నారు. ఈ ఏడాదిలోపు మరో 10 వేలమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ట్యామ్ కామ్ టార్గెట్ పెట్టుకున్నది.

ట్యామ్ కామ్ ద్వారా ఎక్కువగా జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్, పోలండ్, గల్ఫ్ దేశాలు, ఇజ్రాయెల్ కు ఎక్కువగా వెళుతున్నారు. ప్లేస్ మెంట్ల విషయంలో కొన్ని దేశాలు ట్యామ్ కామ్ తో ఒప్పందాలు కూడా చేసుకున్న కారణంగా మోసపోవటం అన్న సమస్యే ఉండదు. ఇజ్రాయెల్ కు ముఖ్యంగా ప్లంబింగ్, ఎలక్ట్రికల్, ఏసీ మెకానిక్కులు, డ్రైవర్లు, సిరామిక్ టైలింగ్, ప్లాస్టరింగ్, బ్లాక్ మేసన్, కేర్ గివింగ్ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలుంటున్నాయి.

జర్మనీ, జపాన్, పోలండ్ తో పాటు ఖతార్ లాంటి గల్ఫ్ దేశాల్లో నర్సులకు అపారమైన అవకాశాలు ఉన్నాయి. 2023 అక్టోబర్ లో ఇజ్రాయెల్ పై హమాస్ దాడుల తర్వాత కార్మిక వ్యవస్ధలో భారీ కొరత ఏర్పడింది. ఇజ్రాయెల్ లో జీత, బత్యాలు బాగా ఎక్కువగా ఉన్న కారణంతో చాలామంది తెలంగాణ వాళ్ళు వెళ్ళటానికి ఉత్సాహం చూపుతున్నారు.

Read More
Next Story