కాళేశ్వరం కేసు.. సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్
x

కాళేశ్వరం కేసు.. సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్

హైకోర్టు తీర్పును ఛాలెంజ్ చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం.


కాళేశ్వరం అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. మాజీ న్యాయమూర్తి పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు సీజే అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మొయినుద్దీ బెంచ్ స్పష్టం చేసింది. ఈ తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టు వెళ్లాలని డిసైడ్ అయింది. న్యాయనిపుణులతో చర్చలు జరిపిన తర్వాత ఈ అంశంలో హైకోర్టు తీర్పును ఛాలెంజ్ చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అతి త్వరలో ఈ పిటిషన్ వేసే అవకాశం ఉంది. తమ పిటిషన్‌తో పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన పూర్తి వివరాలను సుప్రీంకోర్టు ముందు ఉంచడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించడం కోసం రాష్ట్ర క్యాబినెట్ సమావేశానికి ముందు సీఎం రేవంత్ రెడ్డి.. అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో భేటీ అయ్యారు. కాళేశ్వరం అంశంలో న్యాయ కోణాలపై చర్చించారు. భేటీ అనంతరం ఈ అంశంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని తెలంగాణ క్యాబినెట్ కూడా ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం. అయితే పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటును హైకోర్టు ఎక్కడా తప్పుబట్టలేదు. కానీ సాక్షులుగా పిలిచిన వారిని నిందితులుగా చేర్చడాన్ని మాత్రం ఉన్నతన్యాయస్థానం తప్పుబట్టింది. కమిషన్ విచారణ సెక్షన్ 8బీ ప్రకారం లేదని వివరించింది న్యాయస్థానం.

Read More
Next Story