
తెలంగాణకు వచ్చే ఉద్యోగులకు టీజీవో షాక్(వీడియో)
అంతర్రాష్ట్ర బదిలీ విషయంలో టీజీవో సంఘం(తెలంగాణ గెజిడెట్ అధికార్ల సంఘం) అభ్యంతరం చెబుతు తెలంగాణ చీఫ్ సెక్రటరీకి లేఖ రాయటం సంచలనంగా మారింది.
తెలంగాణ స్ధానికత కలిగి ఏపీలో పనిచేస్తున్న వారు తెలంగాణకు రావాలని అనుకుంటున్న ఉద్యోగులకు టీజీవో పెద్ద షాక్ ఇచ్చింది. తెలంగాణ స్ధానికత కలిగి ఏపీలో పనిచేస్తున్న 980 మందిని తిరిగి తెలంగాణకు బదిలీచేయటానికి అభ్యంతరం లేదని ఏపీ చీఫ్ సెక్రటరీ తెలంగాణ చీఫ్ సెక్రటరీకి ఈమధ్యనే లేఖ రాశారు. అయితే వారి అంతర్రాష్ట్ర బదిలీ విషయంలో టీజీవో సంఘం(తెలంగాణ గెజిడెట్ అధికార్ల సంఘం) అభ్యంతరం చెబుతు తెలంగాణ చీఫ్ సెక్రటరీకి లేఖ రాయటం సంచలనంగా మారింది.
తెలంగాణ స్ధానికత కలిగిన ఉద్యోగులను ఏపీనుండి తెలంగాణకు బదిలీచేసే ముందు తమ అభ్యంతరాలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఏపీనుండి తెలంగాణ స్ధానికత కలిగిన వారిని తీసుకురావటం పట్ల తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని కూడా టీజీవో సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు ‘తెలంగాణ ఫెడరల్’ కు చెప్పారు. అయితే సర్వీసు నిబంధనలకు సంబంధించి బదిలీ అయ్యే వారి క్యాడర్ ఏమిటి ? వారు తెలంగాణకు వస్తే ఇక్కడ ఏ క్యాడర్లో నియమిస్తారు ? అనే విషయాలపై క్లారిటి కావాలని చెప్పారు.
అలాగే తెలంగాణలో సదరు ఉద్యోగి పోస్టు లేకపోతే ఏ పోస్టులో నియమిస్తారు లాంటి అనేక ప్రశ్నలను చీఫ్ సెక్రటరీకి టీజీవో అధికారుల సంఘం సంధించింది. తమ ప్రశ్నలకు వివరణలు ఇచ్చినతర్వాతే వారిని ఇక్కడకు బదిలీచేయించేందుకు అంగీకరించాలనే షరతు విధించింది. దీంతో సమస్య మరింత జటిలమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.

