
ప్రధాని నరేంద్ర మోదీ
2047 నాటికి దేశం అభివృద్ది చెందినదిగా మారాలి: ప్రధాని
సప్త ధారలను ప్రస్తావించిన మోదీ
దేశంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశ చరిత్రలో తొలిసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా వందేమాతర గేయాన్ని ఆలపించారు.
దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. 2047 నాటికి భారత్ అభివృద్ది చెందిన దేశంగా మారాలని, అందుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు భారతీయులు పెద్ద కలలు కనాలని పిలుపునిచ్చారు. ‘‘మనం ఈ కలను సాకారం చేసుకునే దిశగా కృషి చేస్తున్నప్పుడూ ప్రపంచం మన దేశాన్ని విభిన్నంగా చూడవలసి వస్తుంది’’ అని ఆయన అన్నారు.
స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులు..
జెండా వందనం సందర్భంగా ఆయన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత తొలిసారిగా వందేమాతర నినాదం మారుమోగుతోందని ప్రధాని అన్నారు. ‘‘ఇకపై మన కలలు సంకల్పాలు గొప్పగా ఉండాలి. ఎందుకంటే మన సామర్థ్యాలను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుంది’’ అని ఆయన అన్నారు. 140 కోట్ల మంది భారతీయుల శక్తితో భారత్ వివిధ రంగాలలో ప్రగతిలో కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని మోదీ అన్నారు.
ఎరుపు రంగు టై అండ్ డై తలపాగా..
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో కొత్త తరహ దుస్తులు, తలపాగా ధరించే సాంప్రదాయం అనుసరించే ప్రధాని.. ఈసారి కూడా అదే సంప్రదాయం అనుసరించారు. ఆయన సంప్రదాయ టై అండ్ డై ఎర్ర తలపాగా ధరించారు. రాజస్థానీ, గుజరాతీ సంస్కృతులలో సర్వసాధారణమైన ఈ సంప్రదాయా తలపాగాను తెల్ల కుర్తా, చాక్లెట్ బ్రౌన్ రంగు చొక్కా ధరించారు. అలాగే కాషాయం, ఆకుపచ్చ, తెలుపు రంగులలో ఉన్న మూడు స్క్వేర్లను కూడా ధరించారు.
ఈ కార్యక్రమానికి హజరైన అతిథులు జాతీయ గీతాన్ని ఆలపిస్తు ఉండగా ఆర్మీ బాండ్ వందేమాతరం బాణీని వాయించింది. భారత వైమానిక దళానికి చెందిన రెండు ఎంఐ-17 హెలికాప్టర్లు ఆ ప్రాంగణంపై పూల రేకులు కురిపించాయి. వాటిలో ఒకటి జాతీయ పతాకాన్ని, ఒకటి వందేమాతరం రాసి ఉన్న జెండాను మోసుకెళ్తున్నాయి.
ఎర్రకోట ప్రసంగం..
పేద యువతకు పోటీ పరీక్షల కోసం ఉచిత ఆన్ లైన్ కోచింగ్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రకటించారు. అలాగే దేశంలో వంద శాతం రైల్వే ఎలక్ట్రిఫికేషన్ జరిగిందని తెలిపారు. గత 70 ఏళ్లలో 30 శాతం విద్యుద్దీకరణ జరిగిందని, కానీ గత పది సంవత్సరాల సమయంలో70 శాతం విద్యుద్దీకరణ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్ భారత్ కోసం ప్రజలంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశంలో మరో ఏడు ఎనిమిది సంవత్సరాలలో ఎనిమిది ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయని ప్రధాని మోదీ అన్నారు.
ఇంధన స్వయం సమృద్ధికి పిలుపునిచ్చారు. కొన్ని దేశాల వనరులు, వ్యూహాత్మక సముద్ర మార్గాలను వాడుకోవడం ద్వారా ఇంధన రంగంలో స్వావలంబన సాధించాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ సాధించడానిక సప్త సింధును సాధించాలని పిలుపునిచ్చారు.
Next Story

