వృద్దురాలి దగ్గర 24 కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్ల ఆటకట్టు
x

వృద్దురాలి దగ్గర 24 కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్ల ఆటకట్టు

ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న కర్ణాటక పోలీసులు


Click the Play button to hear this message in audio format

సీబీఐ, ఈడీ ఉన్నతాధికారులమంటూ 74 ఏళ్ల వృద్ధురాలని మోసం చేసి 24 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన సైబర్ మోసగాళ్లను కర్ణాటక సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాలో కీలకంగా వ్యవహరించిన ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు.

అరెస్ట్ అయిన వారిలో తమిళనాడులోని ఈరోడ్ కు చెందిన ఎన్ శివజ్ఞానం, ముంబైకి చెందిన అక్కాచ్ మల్లిక్, అహ్మాదాబాద్ కు చెందిన ఫలక్ భాయ్ పటేల్, అమిత్ నరేంద్ర పటేల్, న్యూఢిల్లీకి చెందిన ఓం ప్రకాశ్ రాజ్ పుత్, బీహార్ కు చెందిన గౌరవ్ కుమార్ ఉన్నట్లు కర్ణాటక పోలీసులు సోమవారం తెలిపారు.
నిందితులు ఈ ఏడాది ఫిబ్రవరి పది నుంచి ఏప్రిల్ 24 మధ్య వృద్ధురాలికి పలుమార్లు ఫోన్ చేసి డిజిటల్ అరెస్ట్ పేరిట బలవంతం చేశారు. తమ చెప్పిన అకౌంట్లలోకి డబ్బులు పంపమని ఒత్తిడి చేశారు. స్థిరాస్థి అమ్మకం ద్వారా భారీ మొత్తంలో డబ్బులు వచ్చాయని తెలుసుకున్న కేటుగాళ్లు, ఈ భారీ పథకానికి వ్యూహరచన చేశారు. ఇలా పలు దఫాలుగా దాదాపు 24 కోట్ల రూపాయలను కొల్లగొట్టారు. మనీలాండరింగ్ ద్వారా డబ్బును విదేశాలకు పంపారనే నెపంతో బాధితులకు బ్లాక్ మెయిల్ చేశారు.

రూ. 24 కోట్లు, 26 లావాదేవీలు, 23 మ్యూల్ ఖాతాలు.. పది బ్యాంకులు..

వృద్ధురాలిని బలవంతం చేసి దాదాపు 26 లావాదేవీల ద్వారా పది బ్యాంకులో 23 మ్యూల్ ఖాతాలకు రూ. 24 కోట్ల రూపాయలను బదిలీ చేయించుకున్నారు. అయితే అనుమానాస్పద లావాదేవీలుగా గుర్తించిన బ్యాంక్ సైబర్ కమాండ్ యూనిట్ వీటిని వెంటనే నిలిపివేసి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు వృద్దురాలిని చేరుకుని కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు తరువాత బదిలీ చేయాల్సిన మూడు కోట్లను నిలిపివేసింది. అలాగే విదేశాలలో ఉన్న ఆమె పిల్లలకు సమాచారం అందించింది. మ్యూల్ ఖాతాలలో ఉన్న నాలుగు కోట్లను స్తంభింపజేసింది. అలాగే మరో కోటిన్నరను కోర్టు ఉత్తర్వుల ద్వారా వసూలు చేయగలిగింది. అలాగే నేరంలో ఉపయోగించిన ఆరు సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read More
Next Story