మోదీకి అత్యున్నత పురస్కారం ప్రకటించిన ఉజ్బెకిస్తాన్
x

మోదీకి అత్యున్నత పురస్కారం ప్రకటించిన ఉజ్బెకిస్తాన్

యురేనియం సరఫరాపై కీలక ఒప్పందాలు


Click the Play button to hear this message in audio format

భారత్- ఉజ్బెకిస్తాన్ దేశాలు దీర్ఘకాలికంగా యురేనియం సరఫరా కోసం ఒక ఒప్పందానికి వచ్చాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అలాగే ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నతీకరించడానికి కూడా సమగ్ర చట్రం రూపొందించుకోవడానికి అంగీకరించాయని పేర్కొన్నారు.

ఒప్పందంలో భాగంగా రెండు దేశాలు 2030 నాటికి వార్షిక వాణిజ్యాన్ని 5 బిలియన్ డాలర్లకు చేర్చుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని చెప్పారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఒక బిలియన్ డాలర్లకు పైగా ఉంది. ఉజ్ బెగ్ అధ్యక్షుడు షవ్ కత్ మిర్జియోయేవ్ తో చర్చలు జరిపిన అనంతరం ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు.
భారత్- ఉజ్బెకిస్తాన్ మధ్య ఉన్న శాశ్వత బంధానికి అంకితం చేస్తూ, మోదీ ఉజ్బెకిస్తాన్ ప్రతిష్టాత్మక ‘ఒలియ్ దరాజాలి దోస్లిక్’ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. వాణిజ్యం, స్వచ్ఛ ఇంధనం, కనెక్టివిటీ వంటి పలు రంగాలలో సంబంధాలను బలోపేతం చేసేందుకు మోదీ రెండు రోజుల పర్యటనలో ఉన్నారు.

ద్వైపాక్షిక చర్చలు..

చర్చల అనంతరం పౌర- అణు శక్తి రంగంలో సహకారానికి అనుగుణంగా ఉజ్బెకిస్తాన్ నుంచి భారత్, యురేనియం దీర్ఘకాలిక సరఫరా కోసం ఒక చట్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికి రెండు దేశాలు అంగీకరించాయి. ‘‘ఈ చట్రంలోనే నిర్దిష్ట లక్ష్యాలను నిర్ధేశించుకుని మనం ముందుకు సాగుతాం’’ అని ఆయన హిందీలో అన్నారు.

వ్యూహాత్మక సహకారం..

మోదీ- మిర్జియోయేవ్ చర్చలు వాణిజ్యం, పెట్టుబడి, మౌలిక సదుపాయాలు, కీలక ఖనిజాలు, మైనింగ్, రక్షణ, భద్రత, వ్యవసాయం, ఔషధాలు, ఆరోగ్యం, సమాచార సాంకేతికత, యూపీఐతో సహ డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, విద్య వంటి రంగాలలో సహకారాన్ని విస్తరించడంపై దృష్టి సారించాయి.
భారత్, ఉజ్బెకిస్తాన్ ల మధ్య సహకారంలో పెరుగుతున్న లోతు, విస్తరిస్తున్న పరిధిని ప్రతిబింబిస్తూ ఇద్దరూ నాయకులు వ్యూహాత్మక సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఉన్నతీకరించినట్లు ప్రకటించారు.

రక్షణ సంబంధాలు..

‘‘ఉజ్బెకిస్తాన్ మధ్య ఆసియాకు గుండెకాయ వంటిది. అలాగే ఈ ప్రాంతంలో భారత్ భాగస్వామ్యానికి ఇది కేంద్ర బిందువు’’ అని మోదీ అన్నారు.
‘‘బలమైన భారత్- ఉజ్బెకిస్తాన్ భాగస్వామ్యం మధ్య ఆసియాలో శాంతి, పురోగతి, శ్రేయస్సుకు ఒక శక్తివంతమైన చోదక శక్తిగా ఉంటుంది’’ అని ప్రధానమంత్రి అన్నారు. వాణిజ్యం, పెట్టుబడుల విషయానికి వస్తే మార్కెట్ ప్రవేశం, బ్యాంకింగ్ చెల్లింపు వ్యవస్థలు, కనెక్టివిటీకి సంబంధించిన సమస్యలను ఒక క్రమపద్దతిలో పరిష్కారిస్తామని ఆయన అన్నారు.
‘‘మన రెండు దేశాల మధ్య ఉన్న సన్నిహిత రక్షణ, భద్రతా సహకారం మన మధ్య ఉన్న ప్రగాఢమైన పరస్పర విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. భవిష్యత్ లో మన రక్షణ పరిశ్రమల మధ్య ప్రత్యక్ష సంబంధాలను, సహ ఉత్పత్తిని సహ అభివృద్దిని ప్రొత్సహిస్తాము’’ అని మోదీ అన్నారు.
‘‘ఉగ్రవాదం, అతివాదం , వేర్పాటువాదం మొత్తం ప్రాంతానికి తీవ్రమైన సవాళ్లను విసురుతాయని మేము విశ్వసిస్తున్నాము’’ అని ప్రధానమంత్రి అన్నారు.

బౌద్ధ స్థలాల పరిరక్షణ...

ఉజ్బెకిస్తాన్ లోని ఫయాజ్ టెపా, కారా టెపా బౌద్ద క్షేత్రాల పునరుద్దరణ, పరిరక్షణ కొరకు ఒక ఉద్దేశ్యపత్రంపై కూడా అంగీకారం కుదిరింది. దక్షిణ ఉజ్బెకిస్తాన్ లోని ఈ ప్రాచీన బౌద్ద మఠాలు, సిల్క్ రోడ్ వెంబడి బౌద్ధమతం ఎలా వ్యాపించి, మధ్య ఆసియాలోనే వర్దిల్లిందో తెలియజేస్తున్నాయి.

మోదీకి గౌరవం..

ప్రధాని మోదీకి ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్ కత్ మీర్జియోయోవ్ ఈ గౌరవాన్ని ప్రదానం చేశారు. ‘‘ఒలియో దరాజాలి దోస్లిక్’ పురస్కారాన్ని అందుకోవడం గౌరవంగా ఉంది. దీనిని నేను భారత్, ఉజ్బెకిస్తాన్ మధ్య ఉన్న శాశ్వత బంధాన్ని అంకితం చేస్తున్నానని మోదీ ఒక సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
తన ప్రసంగంలో మోదీ ఉజ్బెకిస్తాన్ అత్యున్నత పురస్కారంతో సత్కరించడం నాకు ఎంతో గర్వకారణం అని ఆయన అన్నారు. ప్రధానమంత్రి ఆగష్టు 31, సెప్టెంబర్ 1 తేదీలలో జరిగే 26 షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో పాల్గోనేందుకు తాష్కెంట్ నుంచి కిర్గిజ్ స్థాన్ కు ప్రయాణిస్తారు.


Read More
Next Story