
తెలంగాణ అక్షరాలా రెడ్ల, వెలమ రాజ్యమే..
తెలంగాణ మంచి భూమంతా ఈ రెండు కూలాల చేతిలోనే ఉంది. బీదోళ్ల భూములన్నీ బీడు భూములో, సగం సాగు భూములో...
తెలంగాణ సాగు భూమిలో రెడ్ల వాట 13.5%, వారి జనాభా కేవలం 4.8% మాత్రమే.
తెలంగాణ అక్షరాల రెడ్ల రాజ్యమే. ఇటీవల తెలంగాణలో జరిగిన కుల సర్వే పలితాల ప్రకారం భూమి, ఆస్తుల యాజమాన్యంలో రెడ్లదే అగ్రస్థానం. ఆతర్వాత వెలమ, కమ్మ కులాలు వస్తాయి. తెలంగాణలో ఇవే సంపన్న వర్గాలు. రాష్ట్ర జనాభాలో కేవలం 4.8% ఉన్న రెడ్డిలు, భూమిలో 13.5% వాటాను కలిగి ఉన్నారని తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల (SEEEPC) సర్వే 2024 వెల్లడించింది. ఈ సర్వేను విశ్లేషించిన స్వతంత్ర నిపుణుల బృందం తెలంగాణ(Independent Expert Working Group: IEWG) అసమానతల మీద ఆసక్తికరమయిన విషయాలను వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రప్రభుత్వమే ఈ బృందాన్ని నియమించింది.
సర్వే తెలంగాణలో 242 కులాలను గుర్తించగా, వాటిలో 56 కులాలు జనాభాలో 90% వాటాను కలిగి ఉన్నాయి. ఈ 56 కులాలను సూచిక ప్రకారం ర్యాంక్ చేయగా, అత్యంత సంపన్నమైన మొదటి 10 వర్గాలు వరుసలో వెలమ, రెడ్డి, కమ్మ, కోమటి, కాపు, జైనులు, వీరశైవ (BC), మున్నూరుకాపు (BC), అయ్యంగార్లు/అయ్యర్లు, ఆర్యక్షత్రియ (BC) కులాలుఉన్నాయి. సర్వే ప్రకారం, వెలమలు, రెడ్డిలు, కమ్మలు, కోమటి, కాపులు, జైనులు “సాంప్రదాయకంగా వ్యవసాయాన్ని, వ్యాపారాలను అదుపు చేస్తున్నాయి. దీని వల్ల ఈ వర్గాలకు భూమి మీద, ఇతర చర స్థిరా ఆస్తుల మీద పట్టు కల్పించింది. దీనికి భిన్నంగా అధిక సంఖ్యలో వ్యవసాయ కూలీ పనుల మీద అధారపడిన ఎస్సీ, ఎస్టీ వర్గాలలో భూ యాజమాన్యం బాగా తక్కువ. రెడ్ల తర్వాత ఎక్కువ భూమికి కలిగి ఉన్నకులం వెలమ. జనాభాలోవీళ్లు ౦.4శాతం మించపోయినా భూయాజమాన్యం విషయంలో రెండోస్థానంలో ఉన్నారు. తెలంగాణలో రాజ్యాధికారానికి భూమికి సంబంధం ఉందని అందరికి తెలిసిందే. ఇంతవరకుతెలంగాణ నుంచి ముఖ్యమంత్రులయిన వారంతా ఈరెండుకులాల వాళ్లే. అందుకే ఆ మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండ్లందరికి భూమి కాపాడుకోండి, భూమి ఉంటేనే పొలిటిక్ పవర్ ఉంటుందని పిాలుపునిచ్చారు. ‘రెడ్డి అనే ప్రతివాడికి కనీసం అయిదెకరాల భూమి ఉండితీరాలి, భూములు అమ్ముకోవద్దు, కొనండి," ఆయన పిలుపు ఇచ్చారు. భూమికి పొలిటికల్ పవర్ కి ఉన్న సంబంధాన్ని ఆయన ఇలా స్పష్టంగా చెప్పారు. ఏ కులానికి ఎంత భూమి ఉందో కింది చిత్రం చెబుతుంది.
రెడ్లు, వెలమల దగ్గిర వందల ఎకరాల భూములంటే, ఇతర కులాల దగ్గిరముఖ్యంగా ఎస్ సి,ఎస్ టి, బిసికులాల దగ్గిర ఉన్నభూములన్నీ తునకలే.
Scheduled Castes (SCs) have the highest proportion of small landholding households at 90.5%, followed closely by Backward Classes (BCs) at 85%. This indicates that the majority of these communities are dependent on marginal and fragmented plots of land, which are often less productive, less irrigated, and economically unviable for sustaining agricultural livelihoods.
భూయాజమాన్యంతో పాటు ఇతర ఆస్తుల విషయంలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు బాగా వెనకబడి ఉన్నాయి. సంపద లేని వర్గాలలో అనేక షెడ్యూల్డ్ కుల (SC) వెనుకబడిన తరగతి (BC) సమూహాలు ఉన్నాయి. వీటిలో BC-C SC క్రైస్తవులు (దళిత క్రైస్తవులతో సహా వెనుకబడిన తరగతి–కేటగిరీ C), అలాగే OC (ఓపెన్ కేటగిరీ, లేదా జనరల్ కేటగిరీ) ముస్లింలు కూడా ఉన్నారు. వీరశైవులు మరియు మున్నూరుకాపుల వంటి కొన్ని BC సమూహాలు అయ్యంగార్లు, రాజులు, బ్రాహ్మణుల వంటి కొన్ని సాధారణ కులాల కంటే వెనుకబడినవిగా గుర్తించబడ్డాయి. అత్యంత వెనుకబడిన సమూహంగా షేక్ ముస్లింలు (BC) గుర్తించబడ్డారు. వీరితో పాటు ఖురేషి, ధోబీ, చిప్పోలు, పిచ్చిగుంట్ల, గోల్డ్‌స్మిత్, అరేకటిక, దూదేకుల, ఉప్పర, జంగం, మాలి, మరియు ఒడ్డే వంటి అనేక BC వర్గాలు, అలాగే మాదిగ (SC) కూడా ఉన్నాయి.
రాష్ట్ర జనాభాలో 5.7% ఉన్న యాదవుల చేతిలో (BC) 8.7% భూమి ఉంది. లంబాడీలు (ఎస్టీ) 6.8% జనాభాతో 8.6% భూమిని కలిగి ఉన్నారు. మరోవైపు, మాదిగలు (ఎస్సీ) జనాభాలో 10.3% ఉన్నప్పటికీ, కేవలం 6.5% భూమిని మాత్రమే కలిగి ఉన్నారు. ఎస్ ఎస్టీ వర్గాలలో చాలా మందికి భూమి ఉన్నప్పటికీ, అది బీడుగా, నీటిపారుదల సౌకర్యం లేకుండానో ఉంటుందని ఈ నిపుణల కమిటీలో ఒకరైన ప్రొఫెసర్ ఐలయ్య ‘ ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. విస్తారమైన భూములుకలిగి ఉన్నా ఎస్టీలు సామాజిక పిరమిడ్‌లో అట్టడుగున ఉన్నారని కూడా ఆయన పేర్కొన్నారు. వాళ్లవి అన్నీ చిన్న చిన్న కమతాలు,భీడు భూములు, సాగునీటి సౌకర్యం లేని భూములు. వీటి ఉత్పాదకత బాగా తక్కువ అని ఫ్రొఫెసర్ఐలయ్య పేర్కొన్నారు.
రెడ్లు వెలమల చేతిలోకి భూములు వెళ్లడం కాకతీయుల కాలంలో మొదలయిందని ఆయన చెప్పారు. అప్పటి నుంచి పటేల్ పట్వారీ పదవులు ఈకులాల చేతుల్లోకి వెళ్లాయి.ఈ పదవులు భూయాజమాన్యం పొందేందేకు బాగా ఉపయోగపడ్డాయి. ఇదే విధానం ముస్లిల పరిపానలలో కూడా సాగింది. అయితే, ముస్లింల పాలనతో ముస్లిం జమిందారలు వచ్చారు.వాళ్లు రెడ్ల,వెలమల భూములను కొంత లాక్కున్నారు. పోలీసుపటేల్ పదవులను సంపాదించి బలపడ్డారు. ఇలా పటేళ్లుగా ఉంటూ భూస్వాములయిన ముస్లింల పేర్లే గ్రామాలకు పెట్టారు. నిజాంకాలంలో ఉన్న జమిందారులంతా వెలమలు రెడ్లే. వీళ్లు భూములను వదులుకోవడం నక్సలైట్ ఉద్యమం వచ్చాక మొదలయింది. దీనికి నగరీకరణ కూడా జోడయింది. దీనితో కొంతమంది వెల మలు రెడ్లు భూముల అమ్ముకున్నారు. వాటిని యాదవులు, కురమలు, గౌడ్స కొన్నారు,”అని పేర్కొన్నారు.
రెడ్లు వెలమలు జమిందారులు కావడంతో స్వాతంత్ర్యానంతరం రాజకీయాధికారం సంపాదించారని ఫ్రొఫెసర్ ఐలయ్య వివరించారు. ‘1952 జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో జమిందారులంతా నిలబడ్డారు. వీళ్ల మీద అధారపడిన ఇతర బిసి, ఎసి ఎస్టి కులాలన్నీ వాళ్లకే ఓటేసి అధికారం అప్పగించాయి. ఇది తెలుగుదేశం పార్టీ వచ్చే దాకా కొనసాగింది. తెలుగు దేశంలో భూసంబంధాలలో పెద్దగా మార్పతేలేకపోయినా, రాజకీయాధికారంలో, పాలనలో బలహీన వర్గాలకు ముఖ్యంగా వెనకబడిన వర్గాలకు కొంత భాగస్వామ్యం కలిగించింది. అయితే, భూమి మాత్రం రెడ్ల వెలమల చేతుల్లోనే ఉంది. ఇది రాజకీయాధికారం కాపాడుకునేందుకు దోహదపడుతుంది,” అని ఐలయ్య అన్నారు.
సర్వే వెల్లడించిన మరొక విచిత్రం
భూమి సంగతి ఇలా ఉంటే, రాష్ట్రంలో బాగా అభివృద్ధి చెందిన కులాలకు సంబంధించి టాప్ లో ఉన్న కాపు(ఒసి) కులం.
సర్వేలో లీస్ట్ బ్యాక్ వర్డ్ కులాలు (వెనకబాటు తనం లేని) గా తొమ్మిది కులాలను గుర్తించారు. ఇందులోటాప్ లో కాపుల ఉంటే అట్టడుగున రెడ్డి కులం ఉంది. మధ్య లో పై నుంచి కిందికి జైనులు, రాజులు, అయ్యంగార్లు, వెలమ,కమ్మ బ్రాహ్మణులు ఉన్నారు.
సర్వేఫలితాలను విశ్లేషించి బృందానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి నేతృత్వం వహించారు. ఇందులో కంచ ఐలయ్యతో పాటు విద్యావేత్త, కాంగ్రెస్ నాయకుడు ప్రవీణ్ చక్రవర్తి, ఆర్థికవేత్త సుఖదేవ్ తోరత్, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మాజీ ఛైర్పర్సన్ శాంతా సిన్హా, చరిత్ర ప్రొఫెసర్ భాంగ్యా భుక్య, పర్యావరణవేత్త పురుషోత్తం రెడ్డి, ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్ హిమాంశు, కార్యకర్త నిఖిల్ డే ఉన్నారు. ప్రముఖ ఆర్థికవేత్తలైన జీన్ డ్రెజ్, థామస్ పికెట్టి, జూలియా కేజ్‌లను ఈ బృందానికి ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించారు.

