ధాన్యం నిల్వల్లో రూ.11వేల కోట్ల స్కామ్: కోమటిరెడ్డి
x

ధాన్యం నిల్వల్లో రూ.11వేల కోట్ల స్కామ్: కోమటిరెడ్డి

రేషన్ కార్డులు, బియ్యం పంపిణీ, భారీ స్కామ్ ఆరోపణలు—మంత్రివర్యుడి సమీక్షలో కీలక వ్యాఖ్యలు, అధికారులకు కఠిన ఆదేశాలు.


బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అంతా మోసాలే జరిగాయంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అన్నదాతలకు మేలు చేస్తున్నామని చెప్పుకుంటూ ధాన్యం నిల్వల్లో రూ.11 వేల కోట్ల స్కామ్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమేర రికవరీ చేయించామని కోమటిరెడ్డి వెల్లడించారు. రబీ ధాన్యం సేకరణపై అధికారులతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. అధికారులకు కీలక సూచనలు చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు ఏమాత్రం ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని చెప్పారు. అంతేకాకుండా ధాన్యం కొనుగోళ్లను పెంచాలని, యుద్ధప్రాతిపదికన కొనుగోళ్లను అమలు చేయాలని ఆదేశించారు. అన్ని కొనుగోలు కేంద్రాలకు కావాలాల్సినన్ని లారీలు పంపాలని, ధాన్యం ఎక్కువ ఉన్న ప్రాంతాలకు ఎక్కువ లారీలను పంపాలని ఆదేశించారు.

అదే విధంగా ధాన్యం కొనుగోలు విషయంలో టైమింగ్స్ ఏమీ పాటించొద్దని, కొనుగోళ్లు రాత్రింబవళ్లు జరగాలని సూచించారు. మిల్లులకు ధాన్యం రవాణాను కూడా యుద్ధప్రాతిపకన చేయాలని చెప్పారు. ‘‘ధాన్యం రోడ్లపై పోయకుండా స్కూళ్లు, ఫంక్షన్ హాళ్ల దగ్గర కేంద్రాలు ఏర్పాటు చేయాలని. గత ప్రభుత్వ హయాంలో పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. కానీ మా ప్రభుత్వం 3.78 కోట్ల రేషన్ కార్డులు అందించింది. అంతేకాకుండా రేషన్ షాపుల్లో సన్నబియ్యం సరఫరా చేస్తున్నాం’’ అని చెప్పారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన బంగారు తెలంగాణ హామీ గురించి కూడా ఆయన ప్రస్తావించారు.

‘‘గత ప్రభుత్వ హయాంలో అన్నీ స్కామ్‌లే జరిగాయి. ధాన్యం నిల్వల విషయంలో కూడా రూ.11వేల కోట్ల స్కాం చేశారు. మా ప్రభుత్వం వచ్చాక కాస్తంత రికవరీ చేశాం. పదేళ్ల పాటు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. ఇప్పుడు ఒకేసారి బంగారు తెలంగాణ చేయాలంటే సాధ్యమవుతుందా? అయినా మేము ఒకేసారి బంగారు తెలంగాణ నిర్మిస్తామని చెప్పలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే తెలంగాణ అభివృద్ధి, సంక్షేమాలను చూస్తోంది. సన్నబియ్యం పథకానికి రూ.5వేల కోట్లు, మహాలక్ష్మీ పథకం కింద ఆర్టీసికి రూ.10,160 కోట్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌కు రూ.6వేల కోట్లు చెల్లించింది మా ప్రభుత్వం’’ అని ఆయన చెప్పుకొచ్చారు.

Read More
Next Story