
పిల్లల్లో మొబైల్ అడిక్షన్ కు కారణం తెలుసా ? (వీడియో)
పిల్లల్లో పెరిగిపోతున్న మొబైల్ అడిక్షన్ కు పెద్దలే కారణమని ఒస్మానియా మెడికల్ కాలేజీ సైకియాట్రీ విభాగం అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ ప్రొఫెసర్ కేశవరెడ్డి సుధారాణి అన్నారు.
పిల్లల్లో పెరిగిపోతున్న మొబైల్ అడిక్షన్ కు పెద్దలే కారణమని ఒస్మానియా మెడికల్ కాలేజీ సైకియాట్రీ విభాగం అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ ప్రొఫెసర్ కేశవరెడ్డి సుధారాణి అన్నారు. 0-2 ఏళ్ళ వయసున్న పిల్లలకు అసలు మొబైలే కాదు ఏ విధమైన సోషల్ మీడియాను కూడా పరిచయం చేయకూడదు. రెండేళ్ళలోపు వయసు పిల్లల్లో మెదడు, కళ్ళు చురుకుగా పనిచేయటం అప్పుడే మొదలుపెడతాయి. ఆ దశలో గనుక పిల్లలకు మొబైల్ ను చూపిస్తే దానికే అలవాటు పడే ప్రమాదం ఉంది. అందుకనే చిన్నపిల్లలకు మొబైల్, టీవీలను దూరంగా ఉంచాలని వైద్య నిపుణులు చెబుతుంటారు.
5-12 ఏళ్ళ వయసులోని పిల్లల్లో మొబైల్ రిస్క్ పెరిగిపోతున్నట్లు గుర్తించిన పరిశోధనలు. కౌన్సిలింగ్ కోసం ఉస్మానియా, నీలోఫర్ ఆసుపత్రులకు ప్రతిరోజు వచ్చేకేసులు పెరుగుతుండటమే నిదర్శనం. పిల్లలతో పెద్దలు ఎక్కువసేపు గడపటం వల్ల టీవీలు, మొబైల్ లాంటి వాటికి అడిక్ట్ కాకుండా అడ్డుకునే అవకాశం ఉంది. పిల్లలు మొబైల్‌కు అడిక్ట్ అవటంవల్ల మోదడు, కళ్ళ పనితీరులో తీవ్ర ప్రభావం పడుతోంది.
తమ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కలవకపోవటం, ప్రతి చిన్న విషయానికి చిరాకుపడటం, తమ ఈడు వయసు పిల్లలతో కలవకపోవటం లాంటి లక్షణాల వల్ల పిల్లలు మొబైల్ కు అడిక్ట్ అయినట్లు గుర్తించవచ్చు. పిల్లలను మొబైల్ లాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌కు దూరంగా ఉంచాలంటే పెద్దలు చొరవ తీసుకోవటంతో పాటు వైద్య నిపుణుల కౌన్సిలింగ్ చాలా ముఖ్యమని ప్రొఫెసర్ సుధారాణి చెప్పారు.

