x

మహిళలపై గృహహింస తెలంగాణలో ఎందుకు ఎక్కువో తెలుసా ?

జాతీయ కుటుంబ ఆరోగ్యసర్వే డేటా ప్రకారం తెలంగాణలోని మహిళల్లో ముఖ్యంగా వివాహమయిన వారిలో 37 శాతం మంది గృహహింసను ఎదుర్కొంటున్నారు


మహిళలపై పెరిగిపోతున్న నేరాల నియంత్రణకు తెలంగాణలో ‘జెండర్ రిసోర్స్ సెంటర్స్’ ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. 553 మండలాలకు తలా ఒకటి చొప్పున 553 జీఆర్సీలను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. మహిళలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలపైన గృహహింస, అత్యాచారాలు, వేధింపులు పెరిగిపోతున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చెబుతోంది. అందుకనే గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు మద్దతుగా ఉండేట్లుగా జీఆర్సీలను ఏర్పాటుచేసింది.

జాతీయ కుటుంబ ఆరోగ్యసర్వే డేటా ప్రకారం తెలంగాణలోని మహిళల్లో ముఖ్యంగా వివాహమయిన వారిలో 37 శాతం గృహహింసను ఎదుర్కొంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణనే మహిళలకు వ్యతిరేకంగా జరగుతున్న నేరాల్లో అత్యధిక కేసులను ఎదుర్కొంటోంది. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణలోనే మహిళలపై గృహహింస కేసులు ఎందుకు ఎక్కువగా నమోదవుతున్నాయి ? ఎందుకంటే తెలంగాణలో దశాబ్దాలుగా మహిళలు తీవ్రమైన అణిచివేతకు గురైనవిషయం తెలిసిందే. నిజాంపాలనలో గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల్లో చాలామందికి రక్షణలేకుండా పోయింది. దేశం మొత్తం వ్యవహారం ఒకలాగ ఉంటే నిజాం పాలన మాత్రం మరోలాగ ఉండేది. అందుకనే దేశం మొత్తానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్యం వస్తే నిజాం రాజ్యానికి మాత్రం ఏడాది ఆలస్యంగా స్వాతంత్ర్యం వచ్చింది.

నిజాం పాలనలో జరిగిన దురాగతాల చాయలు ఇప్పటికీ తెలంగాణలో కనబడుతునే ఉంటాయి. కాకపోతే అప్పట్లో హింసకు గురైన వారు ఫిర్యాదులు చేయలేకపోతే ఇపుడు ఫిర్యాదులు చేయగలుగుతున్నారు. తమపై జరుగుతున్న అణిచివేత, గృహహింస, అత్యాచారాలు తదితరాలపై మహిళలు ఫిర్యాదులు చేయగలుగుతున్నారు. అందుకనే దక్షిణాదిలోని మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలోని మహిళలపై గృహహింస కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్నీ రాష్ట్రాల్లోను కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో జీఆర్సీలు ఏర్పాటయ్యాయి. జీఆర్సీల ఏర్పాటుతో మహిళలపై జరుగుతున్న గృహహింస తగ్గుతుందా ?

Read More
Next Story