
హైదరాబాద్ లో మాజీ ఐపిఎస్ అధికారి భార్య హత్య
జూబ్లీహిల్స్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య తనూజ హత్యకు గురయ్యారు. నగదు, నగలు దోచుకుని నేపాలీ ముఠా పరారైంది.
హైదరాబాద్ లో విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ శుక్రవారం నాడు హత్యకు గురైంది. హత్య చేసింది ఇంట్లో నమ్మకంగా పని చేస్తున్న పని మనిషే .
విలాసవంతులు నివాసముండే జూబిలీహిల్స్, ప్రశాసన్ నగర్లో అత్యంత దారుణంగా హత్య జరగడం స్థానికంగా సంచలనమైంది.
ఇటీవల నేపాలీకి చెందిన ఓ మహిళ విశ్రాంత ఐపిఎస్ అధికారి వినయ్ రంజన్ రే కుటుంబాన్ని కలిసింది . కొంతకాలం నమ్మకంగా పనిచేస్తునే మరో ముగ్గురిని కూడా ఇంట్లో చేర్చింది. కొంతకాలం తర్వాత మిగిలిన వాళ్ళతో కలిసి ఈ హత్యకు పాల్పడింది. ఈ కుటుంబం జూబిలీహిల్స్ ప్రశాసన్ నగర్ కాలనీలో మూడు అంతస్తుల భవనంలో ఉంటుంది . మొదటి అంతస్తులో విగత జీవిగా రంజాన్ రే భార్య ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందటంతో వెంటనే వచ్చారు. హత్య జరిగిన సమయంలో వినయ్ రంజన్ రే ఇంట్లో లేరు.
సమాచారం తెలిసిన వెంటనే నగర సీపీ సజ్జనార్ ఘటనాస్థలికి చేరుకున్నారు. చనిపోయిన తనూజ వయస్సు 55 ఏళ్ళు. ఇంట్లో ఉన్న బంగారం, నగదు దోచుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. పరారీలో ఉన్న పనిమనిషి కోసం గాలిస్తున్నారు. ఆధారాలకోసం ఫోరెన్సిక్ బృందాలు సేకరిస్తున్నాయి.

