ఫుట్ బాల్: స్పెయిన్ ఎలా ఆధిపత్యం సాధించింది?
x
విశ్వవిజేతగా నిలిచిన స్పెయిన్

ఫుట్ బాల్: స్పెయిన్ ఎలా ఆధిపత్యం సాధించింది?

అర్జెంటీనా ఆధిక్యం ఎలా మిస్ అయింది?


Click the Play button to hear this message in audio format

ఫుట్ బాల్ ప్రపంచకప్ విజేతగా స్పెయిన్ నిలిచింది. ఆదివారం అమెరికాలోని ఈస్ట్ రూథర్ ఫోర్డ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో నిర్ధిష్ట సమయం వరకూ మొదట విజేత ఎవరూ తేలకపోవడంతో అదనపు సమయానికి దారితీసింది. 106 నిమిషంలో స్పెయిన్ చేసిన గోల్ తో అది విశ్వవిజేతగా నిలిచింది. ఇది ప్రపంచకప్ లో దాని ఆధిపత్యానికి నిదర్శనం.

120 నిమిషాల గేమ్ లో అది దాదాపు బంతిని తన నియంత్రణలోనే ఉంచుకుంది. ఆట వేగాన్ని నిర్ధేశించి, డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను పూర్తిగా నిలువరించగలిగింది. వరుసగా అనేక అవకాశాలను సృష్టించుకుంటూ ముందుకుసాగారు కానీ .. వారికి అర్జెంటీనా గోల్ కీపర్ గ్రేట్ వాల్ లా అడ్డంగా నిలబడ్డారు. లేకపోతే వారి విజయం ఎప్పుడో ఖరారయ్యేదే. చివరకు అదనపు సమయంలో గోల్ కీపర్ ఎమిలియానో మార్టినెజ్ ను బోల్తా కొట్టించిన ఫెర్రాన్ టోర్రెస్ గోల్ కొట్టడంతో దాని విజయం ఖరారు అయింది.

చివరి నిమిషాలలో..

106 నిమిషంలో బార్సిలోనా ఫార్వర్డ్ ఆటగాడు గోల్ చేయడంతో స్పెయిన్ సంబరాల్లో మునిగిపోయింది. అది స్పెయిన్ సంపూర్ణ ఆధిపత్యానికి ఓ సింబల్. అర్జెంటీనా అసమర్థతకు చిహ్నం. ఈ ఫైనల్ మ్యాచ్ లో స్పెయిన్ దాదాపు 65 శాతం బంతిని తమ ఆధీనంలోనే ఉంచుకుంది.


మొత్తం 852 పాస్ లు పూర్తి చేసింది. ఇదే సమయంలో అర్జెంటీనా 464 పాస్ లు మాత్రమే సాధించింది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. బంతిని తమ ఆధీనంలో ఉంచుకోవడం మాత్రమే కాకుండా.. అర్జెంటీనా ఆటను పూర్తిగా దెబ్బతీసింది.
మెస్సీని పూర్తిగా చేష్టలుడిగి పోయేలా చేసింది. స్పెయిన్ 20 షాట్లు గోల్ పోస్ట్ కు చేరగా, అర్జెంటీనావి 12 మాత్రమే చేరాయి. నిజం చెప్పాలంటే అర్థవంతమైన అవకాశాలు సృష్టించుకోవడంలో అర్జెంటీనా తీవ్రంగా ఇబ్బంది పడింది. ఈ మ్యాచ్ లో పోటీ అనేది అర్జెంటీనా వర్సెస్ స్పెయిన్ లా కాకుండా.. స్పెయిన్ వర్సెస్ ఎమిలియానో మార్టినెజ్ కు మధ్య పోటీగా మారింది.

అడ్డుగోడ.. మార్టినెజ్..

ఈ మ్యాచ్ లో రియల్ హీరో ఎవరైనా ఉన్నారంటే అది అర్జెంటీనా గోల్ కీపర్ మార్టినెజ్ మాత్రమే. స్పెయిన్ చేసిన 11 గోల్ ప్రయత్నాలను సమర్థవంతంగా అడ్డుకున్నాడు. ఇది ప్రపంచకప్ ఫైనల్ లో చరిత్ర. తన అద్భుతమైన ప్రతిభతో స్పెయిన్ నిలువరించగలిగాడు. లేకపోతే స్పెయిన్ దాదాపు నాలుగు లేదా ఐదు గోల్స్ తో విజేతగా నిలిచేది.

మెస్సీ పేలవ ప్రదర్శన..

ఈ మ్యాచ్ లో మెస్సీ ప్రదర్శన నిజంగా పూర్తిగా నిరాశపరిచింది. ఈ మ్యాచ్ లో అతను చెలరేగి పోతాడని, వరుసగా రెండోసారి తమ దేశాన్ని ఛాంపియన్ గా నిలుపుతాడని అభిమానులు ఆశించారు. కానీ గ్రౌండ్ పరిస్థితి పూర్తిగా తారుమారు అయింది.

ఇందుకోసం స్పెయిన్ ప్రత్యేక ప్రణాళికలు ఏమి రచించలేదు. కేవలం బంతిని తమ ఆధీనంలోకి తీసుకుంది. దీనితో ప్రత్యర్థి ఆటగాళ్లు సహనం కోల్పోయారు. పదే పదే తప్పులు చేశారు. బంతి ప్రమాదకర ప్రదేశాలలోకి తక్కువ స్థాయిలోకి వెళ్లేలా చేయగలిగారు. దీనితో మెస్సీ ఏం చేయలేకపోయాడు.

ఫెర్నాండెజ్ బయటకు..

స్పెయిన్ పూర్తి ఆధిపత్యంతో ఆటను ఆస్వాదించగా.. అర్జెంటీనా కు ఏం చేయాలనే దానిపై స్పష్టత కొరవడింది. స్పెయిన్ లయను దెబ్బతీసే ప్రయత్నం ఎక్కడా కనిపించలేదు. ఒత్తిడి పెరిగిపోతున్న సమయంలో అనేక ఫౌల్స్ చేశారు.
తరువాత పసుపు కార్డులకు గురయ్యారు. రెండో భాగంలో ఎంజో ఫెర్నాండెజ్ కు రెండో ఎల్లో కార్డ్ రావడంతో మైదానం వీడాల్సి వచ్చింది. దీనితో కేవలం పదిమంది ఆటగాళ్లతోనే అర్జెంటీనా మైదానంలో పోరాడింది. అప్పటికే ఆట దాదాపు వంద నిమిషాలు పూర్తయింది. ఆటగాళ్లంతా అలిసిపోయారు. వారు గోల్ పోస్ట్ కు ఆమడ దూరంలోనే ఆగిపోవాల్సి వచ్చింది.

స్పెయిన్ కూడా తడబడిందా..

ఈ మ్యాచ్ లో స్పెయిన్ పై విమర్శలు ఉన్నాయి. ఇది వారి ఫినిషింగ్ కు సంబంధించింది. ఆట మొత్తం ఆధిపత్యం కనిపించినప్పటికీ నిర్ణయాత్మక గోల్ చేయడానికి అదనపు సమయం వరకూ వేచి చూసింది. కొన్నిసార్లు మరి రక్షణాత్మకంగా ఆడుతున్నారెమో అనిపించింది.
అనేక సార్లు పాస్ లలో కచ్చితత్వం కొరవడింది. తప్పుడు క్రాస్, తొందరపాటు ఫినిషింగ్ కూడా కనిపించాయి. దాదాపు 90 నిమిషాల్లోనే మ్యాచ్ ను ముగించే అవకాశాలు అది సృష్టించుకుంది. కానీ వాటిని గోల్ గా మలచడంలో ఘోరంగా విఫలం అయింది. అయితే విజేతగా నిలిచే సమయంలో దాని పట్టుదల మాత్రం వదలేదు. ఓపికగా బంతిని తమ ఆధీనంలో నిలుపుకుంటూనే చివరకు ఫెర్రాన్ టోర్రెస్ సాధించిన గోల్ తో విజేతగా నిలిచింది.

సాంకేతిక ఆధిపత్యం..

ఈ ఓటమి అర్జెంటీనాలో కచ్చితంగా ఆత్మపరిశీలనకు దారితీస్తుందనడంలో సందేహం లేదు. ప్రపంచకప్ ఫైనల్ ఓడటం బాధాకరం.. అందులో ఆట మీద పెద్దగా ప్రభావం చూపకుండా ఓడిపోవడం మరింత దురదృష్టం. ఇది కేవలం ఓటమే కాదు.. వ్యూహాత్మకంగా సాంకేతికంగా తడబడటం. తమ పట్టుదలతో ప్రశంసలు అందుకునే దక్షిణ అమెరికా జట్టు.. ఆట ప్రారంభం నుంచే ఏదో కోల్పోయినట్లు కనిపించింది. ఆరంభంలోనే ఆధిక్యం పొగొట్టుకుని.. తిరిగి పోటీలోకి రాలేకపోయారు. అసలు ఆ అవకాశం కోసమే ప్రయత్నించలేదు.
మరో వైపు స్పెయిన్ మాత్రం దూసుకుపోయింది. బంతిని అదుపులో ఉంచుకోవడం, ఓర్పు, నిరంతర ఒత్తిడిని జయించి చివరకు విజేతగా నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్ పై పూర్తి ఆధిపత్యాన్ని చూపారు. దీనిని చరిత్ర ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది.
Read More
Next Story