భారత్- చైనా మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవా?
x

భారత్- చైనా మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవా?

లఢఖ్ ప్రాంతాలకు కొత్తగా పేర్లు పెట్టిన న్యూఢిల్లీ, వ్యతిరేకించిన బీజింగ్


Click the Play button to hear this message in audio format

గల్వాన్ ఘటన తరువాత భారత్, చైనా మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ మధ్య భారత్ లో జరిగిన బ్రిక్స్ సమావేశంలో చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ రావడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని అందరూ భావించారు.

రెండు దేశాల మధ్య చిరకాలంగా వివాదాస్పదంగా ఉన్న హిమాలయ సరిహద్దు విషయంలో కొత్తగా వివాదం చెలరేగింది. భారత్ ఈ మధ్య లఢక్ లోని కొన్ని ప్రాంతాలకు పేర్లు పెడుతూ నిర్ణయం తీసుకుంది.

కేంద్రపాలిత ప్రాంతంలోని 28 ప్రదేశాలకు కొత్తగా పేర్లు పెడుతూ నిర్ణయం తీసుకుంది. అయితే చైనా దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. చైనా విదేశాంగమంత్రి ప్రతినిధి మావో నింగ్ ఇటీవల ఒక బీఫ్రింగ్ లో మాట్లాడుతూ.. బీజింగ్ లఢక్ హోదాను ఎన్నడూ గుర్తించలేదని అన్నారు. భారత్ తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధం, చెల్లనిదిగా తిరస్కరించిందని అన్నారు.

సరిహద్దు వివాదం..

కొత్తగా పేర్లు పెట్టడం అనేది ప్రదేశాలను గుర్తించడం మాత్రమేనని సార్వభౌమాధికారాన్ని మార్చడని భారత్ చెబుతోంది. చైనా ప్రాదేశిక వాదనలను తిరస్కరిస్తూ లఢక్ భారత్ లో విలీనమైన, విడదీయరాని భాగమని న్యూఢిల్లీ పునరుద్ఘాటించింది. సంవత్సరాల తరబడి తీవ్రమైన సరిహద్దు ఉద్రిక్తతల తరువాత ఇరుదేశాలు సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ వివాదాస్పదమైన సరిహద్దుపై తాజా ఘర్షణ తలెత్తింది.
లఢక్ కేంద్రపాలిత ప్రాంతాన్ని తాము గుర్తించబోమని, అక్సాయ్ చిన్, లఢఖ్ లోని కొన్ని ప్రాంతాలతో సహ సరిహద్దు పశ్చిమ భాగం తమ భూభాగమేనని చైనా చెబుతోంది.
2026 అక్టోబర్ లో సర్వే ఆఫ్ ఇండియా లఢఖ్ లోని 28 భౌగోళిక లక్షణాల పేర్లను ప్రామాణీకరించింది. దీనిపై చైనా వెంటనే స్పందించింది. ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ ఈ చర్యను చట్టవిరుద్దమైనదిగా, చెల్లనిదిగా తిరస్కరించారు. బీజింగ్ లఢక్ కేంద్రపాలిత ప్రాంతాన్ని ఎన్నడూ గుర్తించలేదని, దాని పశ్చిమ భాగం చైనాకు చెందినదని ఆయన పేర్కొన్నారు.
లఢఖ్ అనేది భారత్ లో అంతర్భాగం, విడదీయరానిది అని అలాగే అంతర్గత పట నామకరణానికి విదేశీ గుర్తింపు అవసరం లేదని పునరుద్ఘాటిస్తూ చైనా అభ్యంతరాలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గట్టిగా తిరస్కరించింది.
ప్రస్తుతం చైనా, భారత్ హక్కులు కోరుతున్న అక్సాయ్ చిన్ లో సుమారు 38 వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని పరిపాలిస్తోంది. ఈ రెండు దేశాలు సరిహద్దు ప్రాంతాలపై పదేపదే పటరూపక ప్రతీకార నిరసనలలో నిమగ్నమయ్యాయి.
గత సంవత్సరం సర్వే ఆఫ్ ఇండియా ఆ రాష్ట్రంలోని 27 ప్రాంతాల పేర్లను ప్రామాణీకరించిన తరువాత చైనా మొత్తం అరుణాచల్ ప్రదేశ్ పై తన వాదనలను పునరుద్ఘాటించి, దానిని దక్షిణ టిబెట్ అని వాదిస్తూ ఉంది.

కార్టోగ్రాఫిక్ ద్వంద్వ ప్రమాణం..

సర్వే ఆఫ్ ఇండియా చేపట్టిన ఈ నామకరణ ప్రక్రియను చైనా అధికారులు, ప్రభుత్వ ఆధీనంలోని మీడియా రెచ్చగొట్టే చర్యగా అభివర్ణిస్తున్నారు. భారత్ అధికారులు మాత్రం చైనా ఇటువంటి జాబితాలను ప్రచురించడం సాధారణమేనని అంటున్నారు.
ఇప్పటి వరకూ ఒక్క అరుణాచల్ ప్రదేశ్ పైనే ఆరు జాబితాలను విడుదల చేసిందని, 1950 ల నుంచి పూర్తిగా భారత నియంత్రణలో ఉన్న ప్రాంతాలకు చైనా పేర్లను పెట్టిందని వారు చెబుతున్నారు. 1962 సరిహద్దు యుద్ద సమయంలో చైనా సైన్యం స్వాధీనం చేసుకున్న ఈ ప్రాంతాలలో చాలావాటిని నిలుపుకోలేదని, అందువల్ల ఈ వాదనలకు వాస్తవ ఆధారం లేదని, భారత సైన్యాన్ని కట్టిపడేసీ ఖరీదైన, భారీ, అన్ని కాలాలకు అనువైన సైనిక మోహరింపులకు బలవంతం చేసే చైనా వ్యూహంలో ఇది ఒక భాగమని వారు అంటున్నారు.
తాజా మ్యాప్ ఘర్షణ, పరిష్కారం కానీ తీవ్రమవుతున్న సరిహద్దు వివాదం ఈ రెండు ఆసియా దిగ్గజాల మధ్య సంబంధాలను సాధారనీకరించే ప్రయత్నాలను ఎల్లప్పుడూ అడ్డుకంటుందనే వాదనను మరింత నొక్కి చెబుతోంది.
సరిహద్దు వివాదం పరిష్కారం కాకపోయినా, ద్వైపాక్షిక సంబంధాలు అన్ని ఇతర రంగాలలోనూ అభివృద్ది చెందగలవని చైనా సంస్కరణలవాద నాయకుడు డెంగ్ సియాపింగ్ భారత్ దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీకి చెప్పారు.
కానీ 1993 శాంతి, ప్రశాంతత ఒప్పందం, 2013 సరిహద్దు రక్షణ సహకార ఒప్పందం వంటి రెండు సమగ్ర ఒప్పందాలు ఉన్నప్పటికీ ఆయుధ బలంతో తమ హక్కులను నిరూపించుకోవాలని నిశ్చయించుకున్న దూకుడు సైనిక కమాండర్ల వల్ల శాంతి, సాధారణ పరిస్థితులు తరచుగా దెబ్బతిన్నాయి. 2017 డోక్ లా ప్రతిష్టంభన, 2020 గల్వాన్ ఘర్షణలు, శాశ్వత సరిహద్దు పరిష్కారం లేకుండా రెండు దేశాల మధ్య సుస్థిర శాంతి సాధ్యం కాదని మాత్రమే నొక్కి చెబుతున్నాయి.

టిబెట్ ప్రశ్నలు...

సరిహద్దులో కొత్తగా తలెత్తిన సమస్య తరువాత ప్రవాస టిబెట్ నాయకత్వం కొన్ని కఠినమైన వ్యాఖ్యలు చేయడం బహుశా యాధృచ్చికం కాకపోవచ్చు. ప్రస్తుతం 91 ఏళ్ల వయస్సు ఉన్న దలైలామా ఇటీవల మాట్లాడుతూ.. అస్థిరమైన ప్రపంచ పరిస్థితుల మధ్య ప్రపంచవ్యాప్తంగా చైనాకు పెరుగుతున్న శక్తి, ప్రభావం ఉన్నప్పటికీ టిబెట్ ఉద్యమం నిలబడుతుందని అన్నారు. ‘‘సంస్కృతి, మతం లోతుగా పాతుకుపోయిన నేపథ్యంలో టిబెట్ సమస్య సజీవంగానే ఉంటుంది’’ అని ఆయన న్యూస్ 18 తో అన్నారు.
ప్రపంచంలోని చాలామందికి టిబెటన్ ఉద్యమం టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడితో విడదీయరానిదిగా మారింది. ఆయన వయస్సు పైబడుతుండటం ఈ ఉద్యమం భవిష్యత్ పై ప్రశ్నలను లేవనెత్తింది. మార్చి 2025 లో ప్రచురించబడిన తన ‘వాయిస్ ఫర్ ది వాయిస్ లెస్.. ఓవర్ సెవెన్ డెకెడ్స్ ఆఫ్ స్ట్రగుల్ విత్ చైనా ఫర్ మై ల్యాండ్ అండ్ మై పీపుల్’ అనే పుస్తకంలో ఈ పోరాటం తన ఉనికిపై ఆధారపడకూడదని ఆయన రాశారు. ఇది ఒక ప్రాచీన ప్రజల, వారి సంస్కృతి, భాష, మతం మనుగడకు సంబంధించినదని ఆయన వర్ణించారు.
‘‘టిబెటన్లు దాదాపు 75 సంవత్సరాలుగా స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారు. వారి పోరాటం నా జీవితకాలం తరువాత కూడా కొనసాగాలి’’ అని ఆయన రాశారు. 2011 లో దలైలామా తన రాజకీయ అధికారాన్ని ఎన్నికైన టిబెటన్ నాయకత్వానికి అప్పగించారు. అప్పటి నుంచి ధర్మశాల కేంద్రంగా పనిచేస్తున్న సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ ప్రవాస సమాజానికి రాజకీయంగా ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆయన వారి అత్యంత ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్తిగా కొనసాగుతున్నారు.

బీజింగ్.. దలైలామా వారసత్వం..

2025 దలైలామా తన 90 వ పుట్టిన రోజుకు ముందు వారసుడి పై ఏళ్ల తరబడి నెలకొన్న అనిశ్చితికి ముగింపు పలుకుతూ దలైలామా పదవి కొనసాగుతుందని ఆయన ధృవీకరించారు. తన భవిష్యత్ పునర్జమ్మను గుర్తించే ఏకైక అధికారం తన గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్ కే ఉందని ఆయన ప్రకటించారు.
తదుపరి దలైలామాను చైనా ప్రభుత్వమే ఆమోదించాలన్న బీజింగ్ వాదనను పూర్తిగా ఖండిస్తూ ఈ ప్రకటన మతపరమైన అధికారాన్ని ప్రత్యక్షంగా నొక్కి చెప్పింది. కొన్ని విధాలుగా, దలైలామా విషయంలో బీజింగ్ అనవసరమైన కఠిన వైఖరే టిబెట్ సమస్యపై అర్థవంతమైన పురోగతి లేకపోవడానికి కారణం.
టిబెట్ ను చైనాలో భాగంగా అంగీకరించి శాంతియుత పరిష్కారానికి ఆయన కట్టుబడి ఉన్నప్పటికీ దలైలామాను విచ్ఛిన్నవాది అని, గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు అని ముద్ర వేసి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దలైలామా మరణించాక టిబెట్ పోరాటం సద్దుమణుగుతుందని చైనా భావించింది.
కానీ టిబెట్ నాయకత్వంలోని కొత్తతరం ఆ ఆధ్యాత్మిక నాయకుడి కంటే మరింత కఠిన వైఖరిని కలిగి ఉండవచ్చు. హాంగ్ కాంగ్ లాగే టిబెట్ కూడా ఒకే దేశం, రెండు వ్యవస్థలు అనే నమూనాకు సరిగ్గా సరిపోయేది. దలైలామా అధికారంలో ఉంటే టిబెట్ హక్కులను గుర్తించడం ఆధారంగా ఒక తుది పరిష్కారం సాధ్యమయ్యేది.
(ది ఫెడరల్ అన్ని వర్గాల వారి అభిప్రాయాలను అందిస్తుంది. వ్యాసంలోని సమాచారం, ఆలోచనలు, అభిప్రాయాలు రచయితవి. అవి తప్పనిసరిగా ది ఫెడరల్ అభిప్రాయాలను ప్రతిబింబించవు)
Read More
Next Story