
మధ్యంతర ఎన్నికల గండాన్ని ట్రంప్ గట్టెక్కుతారా?
పట్టించుకోనని చెబుతూనే విస్తృత ప్రచారం చేస్తున్న అమెరికా అధ్యక్షుడు
అమెరికా అధ్యక్షుడు యూఎన్ 81వ సర్వసభ్య సమావేశంలో ప్రసంగించారు. ఎప్పటిలాగే తన ఉపన్యాసంలో ఎక్కువ భాగం తన స్కోత్కర్షకు కేటాయించారు. ముఖ్యంగా ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ పై యుద్ధాన్ని ప్రారంభించాయి.
ఇదే విషయాన్ని ఆయన పదేపదే ప్రస్తావించారు. తనతో ఒప్పందం చేసుకుంటారా? లేక నాశనం అయిపోతారా అంటూ హెచ్చరికలు చేశారు. ‘‘ఇరాన్ ఒప్పందం చేసుకుంటుందని, ఎందుకంటే వారు అలా చేయకపోవడంలో అర్థం లేదు’’ అని ఆయన తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
తాను లేవనెత్తిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించారు. అలా చేస్తూ ఒప్పందాన్ని ఆలస్యం చేస్తే ఇరాన్ నష్టపోతుందని హెచ్చరించారు. ఇరాన్ వాదన తప్పు అన్నారు. ‘‘మధ్యంతర ఎన్నికలలో నేను ఎలా రాణిస్తానా అని చూడానికి ఇరాన్ తహతహలాడుతోంది.
వారికి అర్థం కాని విషయం ఏంటంటే... నేను పోటీలో లేను. నేను ఇప్పటికే భారీ మెజారిటీతో గెలిచాను. నేను అఖండ విజయం సాధించాను. నేను మరో రెండున్నర సంవత్సరాల పాటు ఇక్కడే ఉంటాను. ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ పోటీ చేస్తోంది.
నేను వారికి సాయం చేస్తాను. నేను ఈ ఎన్నికలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు.. ఇవ్వను కూడా. ఇరాన్ విషయానికి వస్తే అది నా మనస్సులోకి కూడా రాదు. నా మదిలో ఉన్నది ఏంటంటే దానికి ఎప్పటికి అణ్వాయుధం దక్కనివ్వను’’
ట్రంప్ కు పరీక్ష...
ట్రంప్ తో ఎలా వ్యవహరించాలనే దానిపై ఇరాన్ మల్లాగుల్లాలు పడుతోంది. ముఖ్యంగా మధ్యంతర ఎన్నికల ఫలితాలపై అది గంపెడు ఆశలు పెట్టుకుంది. ఇరాన్ ఆలోచన కూడా సరైనదే అనిపిస్తోంది. మధ్యంతర ఎన్నికల ఫలితాలను తాను పట్టించుకోవడం లేదని ట్రంప్ పదేపదే ప్రకటిస్తూ ఉన్నప్పటికీ ఆయన చర్యలు మాత్రం ఆ విధంగా లేవు.
అమెరికా మధ్యంతర ఎన్నికలకు కేవలం నెల రోజుల కంటే తక్కువ సమయం మాత్రమే ఉంది. నవంబర్ 3న ఎన్నికలు జరగనున్నాయి. అమెరికా సెనెట్ లో 35 స్థానాలకు, వంద స్థానాలు ప్రతినిధుల సభకు జరుగుతాయి.
ప్రస్తుతం అధికారంలో ఉన్న ట్రంప్ కు సెనెట్, హౌస్ రెండింటిలోనూ మెజారిటీ ఉంది. కానీ ఇప్పుడు ముందుస్తు అంచనాల ప్రకారం రిపబ్లిక్ పార్టీకి భారీ ఓటమి తప్పదనే సంకేతాలు వస్తున్నాయి. రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల్లో ఎలక్టోరల్ కాలేజీలో, పోలైన మొత్తం ఓట్లలోనూ ఆయన భారీ మెజారిటీతో గెలుపొందారు.
రిపబ్లిక్ పార్టీ ఆయన ఆధిపత్యంలోనూ నడిచింది. 2020 ఎన్నికల ఫలితాలు చెల్లవని ఆయన ప్రకటించారు. తనను వ్యతిరేకించిన వారందరిని పక్కకు నెట్టేశారు. కాంగ్రెస్( ఆ దేశ పార్లమెంట్) లో పట్టు చిక్కిన తరువాత సుప్రీంకోర్టులోనూ పంతం నెగ్గించుకున్నారు. ఇందులో అధ్యక్షుడికి ఉండే ప్రత్యేక పవర్ లు, వలసలకు సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ట్రంప్ ను అమెరికా అధ్యక్షుల చరిత్రలో ప్రత్యేకంగా నిలబెట్టాయి.
ఇప్పుడు జరిగే ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీకి ఓటమి తలెత్తితే ఆయన పట్టు సడలుతుంది. కాంగ్రెస్ లో తన పార్టీ పట్టు కోల్పోయినప్పటికీ ఇరాన్ విషయంలో మాత్రం తన వైఖరి మారదని ఆయన ఘంటాపథంగా చెబుతున్నారు.
ఇరాన్ కు అణ్వాయుధం దక్కకూడదనే అంశంపై అమెరికా రాజకీయా నాయకులు మాత్రం ఏకాభిప్రాయంతోనే ఉన్నారు. కానీ కొద్దికాలం క్రితం మాత్రం రిపబ్లికన్ పార్టీ ట్రంప్ పై మనసు మార్చి, దాడులకు కాస్త విరామం ఇవ్వగలిగింది.
అయితే తన మాటే నెగ్గాలనే పంతం ఉన్న ట్రంప్ గల్ఫ్ ప్రాంతానికి మరో విమానవాహాక నౌక, అదనంగా రెండు వేల మంది మెరైన్లను పంపారు. తద్వారా ఇరాన్ విధానంలో సంబంధం లేదనే తన సందేశాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. అయినప్పటికీ ఇరాన్ ఈ చర్యను తేలిగ్గా తీసుకుని, మధ్యంతర ఎన్నికల ఫలితాల కోసం వేచి చూసే అవకాశం ఉంది.
పోరు హోరాహోరీ...
సెనేట్ లో ప్రస్తుత పరిస్థితి ఏంటంటే.. అధికారంలో ఉన్న రిపబ్లికన్లకు 53 సీట్లు, విపక్ష డెమోక్రాట్లకు 45 సీట్లు ఉన్నాయి. ఇద్దరు సెనేటర్లు స్వతంత్ర్యంగా ఉన్నారు. కానీ వీరు కూడా డెమోక్రాట్లకు అనుకూలంగా ఉన్నారు. గణాంకాల ప్రకారం.. సభలో మెజారిటీ సాధించడానికి డెమోక్రాట్లు నాలుగు సీట్లు గెలవాల్సి ఉంది. రిపబ్లికన్లు రెండు సీట్లు కోల్పోయినా సభను తమ చేతుల్లో ఉంచుకోగలరు.
435 మంది సభ్యులున్న సభలో రిపబ్లికన్లకు వాస్తవంగా 219 స్థానాలు ఉండగా, డెమోక్రాట్లకు 212 స్థానాలు ఉన్నాయి. నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. హోరాహోరీగా సాగే ఎన్నికలలో ఫలితాలను అంచనావేయడం కష్టమే. ఈ పనిని చేపట్టే వారు తమన పక్షపాతాలన్నింటిని ఎన్నడూ దాటలేరు. అమెరికాలో పోల్ ఫలితాలను సెఫాలజిస్టులు ముందస్తుగా వెల్లడించడంలో విఫలం అవుతూనే ఉంటారు. దీని ప్రకారం రిపబ్లికన్ల విజయం అంత సులువు కాదని తెలుస్తోంది. ఇది పార్టీలో ఆందోళనకు దారితీస్తోంది.
పెరిగిన ఇంధన ధరలు..
ఇరాన్ యుద్ధం అమెరికాలో ఇంధన ధరలు పెంచింది. ఇది ద్రవ్యోల్భణ ఒత్తిళ్లకు దారితీసింది. గ్యాసోలీన్ ధరలు సగటున 40 శాతం పెరిగాయి. అయితే రాష్ట్రాల వారీగా ఇందులో వ్యత్యాసాలు ఉన్నాయి. ఇరాన్ తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా వినియోగదారులు 100 బిలియన్ డాలర్లకు పైగా చెల్లించారు.
ఇది ట్రంప్ కు, రిపబ్లికన్లకు నష్టం కలిగిస్తోంది. రాబోయే నాలుగు నెలల్లో తమ నిల్వల నుంచి పదికోట్ల బ్యారెళ్ల ముడి చమురు, డీజీల్ ను విడుదల చేయడానికి జీ7 దేశాలు అంగీకరించాయి. ఈ దేశాలకు తమ దేశం నుంచి పెట్రోలియం ఎగుమతులు నిషేధిస్తామని ట్రంప్ బెదించారు. చమురు మార్కెట్లను స్థిరీకరించడానికి ట్రంప్ ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అవన్నీ విఫలం అవుతున్నాయి.
బలహీనంగా మారబోతున్న ట్రంప్..
ట్రంప్ రేటింగ్ లు 26 శాతం నుంచి 30 శాతం మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. హోరాహోరీ పోరులో ఉన్న రిపబ్లికన్ అభ్యర్థులకు ట్రంప్ నుంచి ఎలాంటి మద్దతు లభించడం లేదు. చాలామంది అభ్యర్థులు ఆయన నుంచి దూరంగా ఉంటున్నారు. ఇది పార్టీకి ఎంతమాత్రం మంచిదికాదు.
కాంగ్రెస్ ను కోల్పోవడం అంటే కమిటీల నాయకత్వాలు డెమోక్రాట్ల చేతికి వెళ్తాయని అర్థం. ఇది కాంగ్రెస్ ను ధిక్కారంతో చూస్తున్న ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ వంటి వారిపై ఒత్తిడిని పెంచుతుంది. ఫలితంగా వారు ఇరాన్ యుద్దాల విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరిస్తారు. మిత్రులు, శత్రువుల పై ట్రంప్ వ్యవహరించే తీరుకి బ్రేక్ పడవచ్చు.
ఇరాన్ విప్లవం కాలంలో అమెరికా బందీలను విడుదల చేయకపోవడంతో 1980 ఎన్నికల్లో జిమ్మీకార్టర్ ఓడిపోయారు. ఇది ఇరానీయులకు గుర్తుంది. నలభై ఆరు సంవత్సరాల తరువాత దీన్ని మరోసారి ప్రయోగించడానికి సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ చేజారితే ఆయనకు ఎంత అధికారం ఉంటుందనే ఇంకా తెలియదు. ఇరాన్ తో యుద్దాన్ని కొనసాగించడానికి బలవంతంగా చర్యలు తీసుకోవడానికి మొగ్గు చూపినప్పటికీ ఈ విషయం ఇరాన్ యుద్దంపై ప్రభావం చూపుతుంది.
( ది ఫెడరల్ అన్ని వర్గాల అభిప్రాయాలను గౌరవిస్తుంది. వ్యాసంలోని సమాచారం, ఆలోచనలు, అభిప్రాయాలు రచయితవి. అవి తప్పనిసరిగా ది ఫెడరల్ అభిప్రాయాలను ప్రతిబింబించవు)
Next Story

