22ఏ నుండి లక్షలమందికి రిలీఫ్
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 300 కాలనీల్లోని ఇళ్ళు, ఫ్లాట్లు, ఓపెన్ ప్లాట్ల యజమానులు సుమారు 2 లక్షల మందికి పెద్ద రిలీఫ్ దొరుకుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.
రాష్ట్రంలోని లక్షలాదిమందిని బాగా ఇబ్బంది పెడుతున్న 22ఏ నిషేధిత భూముల సమస్య నుండి సుమారు లక్షలమందికి ఉపసమనం లభించబోతోంది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ అనుమతులతో నిర్మించుకున్న ఇళ్ళు, ఫ్లాట్లు లేదా ఓపెన్ ప్లాట్లను 22ఏ నిషేధిత చట్టం నుండి మినహాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 300 కాలనీల్లోని ఇళ్ళు, ఫ్లాట్లు, ఓపెన్ ప్లాట్ల యజమానులు సుమారు 2 లక్షల మందికి పెద్ద రిలీఫ్ దొరుకుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధితో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాల్లోని ఎక్కువమందికి లబ్దిపొందే అవకాశాలున్నాయని అంచనా. చాలాకాలంగా 22ఏ నిషేధి చట్టం పరిధిలో సుమారు 93 లక్షల ఆస్తులున్న విషయం తెలిసిందే. 1999లోనే ఈ సమస్య మొదలైనా, 2014-23 మధ్య పెరిగిపోయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 2023-2026 మధ్య సమస్య మరింతగా పెరిగిపోవటంతో బాధితులు రోడ్లపైకి వస్తున్నారు.
22ఏ కారణంగా జనాలు అవసరాలకు తమ ఆస్తులను అమ్ముకోలేకపోతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే కాకుండా వరంగల్, కరీంనగర్, ఖమ్మం లాంటి జిల్లాల్లో కూడా బాధితులు పెరిగిపోతున్నారు. అందుకనే గ్రేటర్ హైదరాబాద్, హైదరాబాద్ మెట్రోపాలిటన్, డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అనుమతులున్న నిర్మాణాలు 22ఏ చట్టంలోనే ఉన్నా అమ్ముకోవటానికి వెసులుబాటు కల్పించింది. పైన చెప్పిన మూడుసంస్ధల అనుమతులను పరిశీలించిన తర్వాత ఆస్తులను అమ్ముకోవటానికి, కొనుగోలుచేయటానికి రిజిస్ట్రేషన్ ఆఫీసులు ప్రాసెస్ చేయాలని ప్రభుత్వం అన్నీ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఆదేశాలను జారీచేసింది.

