బీజేపీలో అధికారికంగా విలీనం అయిన ‘ఆప్’ ఎంపీలు
x
రాఘవ్ చద్దా

బీజేపీలో అధికారికంగా విలీనం అయిన ‘ఆప్’ ఎంపీలు

ప్రకటించిన రాజ్యసభ చైర్మన్


Click the Play button to hear this message in audio format

ఆమ్ ఆద్మీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ నుంచి ఫిరాయించిన ఏడుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో విలీనం కావడాన్ని చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ సోమవారం అధికారికంగా ఆమోదించారు. దీంతో రాజ్యసభలో అరవింద్ కేజ్రీవాల్ పార్టీ బలం మూడుకు తగ్గింది.

ఈ మార్పు తర్వాత రాజ్యసభలో బీజేపీ బలం 113కు పెరిగింది. రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, హర్భజన్ సింగ్, సందీప్ పాఠక్, విక్రమ్‌జిత్ సహానీ, స్వాతి మాలివాల్, రాజిందర్ గుప్తా ఏఏపీ నుంచి ఫిరాయించి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.

రాజ్యసభ వెబ్‌సైట్ ప్రకారం, ఈ ఏడుగురు ఎంపీలు ఇప్పుడు బీజేపీ సభ్యుల జాబితాలోనే ఉన్నారు. విలీనం తర్వాత తమను బీజేపీ ఎంపీలుగానే పరిగణించాలని కోరుతూ ఈ ఏడుగురు ఎంపీలు శుక్రవారం రాజ్యసభ ఛైర్మన్‌కు వినతిపత్రం సమర్పించగా, దానిని ఆయన ఆమోదించారని వర్గాలు తెలిపాయి.
పార్టీ మారిన ఈ ఏడుగురు ఎంపీల సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆప్ ఆదివారం రాజ్యసభ ఛైర్మన్‌కు వినతిపత్రం సమర్పించింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ, ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీకి వీడి, బీజేపీలో విలీనమవుతున్నట్లు ప్రకటించిన రాజ్యసభలోని ఏడుగురు ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ తాను ఛైర్మన్ రాధాకృష్ణన్‌కు ఒక వినతిపత్రాన్ని సమర్పించినట్లు తెలిపారు.
కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీ తన సూత్రాలు, విలువలు, మౌలిక నైతికత నుంచి పక్కకు తప్పుకుందని ఆరోపిస్తూ, గత శుక్రవారం ఏడుగురు రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేసి బీజేపీలో విలీనమవుతున్నట్లు ప్రకటించడంతో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.
Read More
Next Story