x

కవిత హామీలు ఆచరణ సాధ్యమేనా ?

పేదలు, రైతులు, యువతను ఆకర్షించటమే టార్గెట్‌గా హామీలిచ్చినట్లు అర్ధమవుతోంది.


రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత ఆచరణసాధ్యంకాని హామీలను ప్రకటించారు. హామీలు కూడా పేదలు, రైతులు, యువతను ఆకర్షించటమే టార్గెట్‌గా హామీలిచ్చినట్లు అర్ధమవుతోంది. తొందరలోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల ఎన్నికలు జరగబోతున్నాయి.

అలాగే 2027 మార్చిలో రెండు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల ఎంఎల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఆచరణ సాధ్యంకాని హామీలను గుపించినట్లున్నారు. నిజామాబాద్ ‘పాంచజన్య సంకల్ప’ సభలో కవిత మాట్లాడుతు టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ప్రైవేటు స్కూళ్ళల్లో కూడా పేద పిల్లలకు ఉచిత విద్యను అందిస్తామన్నారు. కవిత హామీని 10 వేల ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యాలు ఎందుకు అంగీకరిస్తాయి ?

పేదలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితవైద్యాన్ని అందుబాటులోకి తెస్తానని హామీ ఇచ్చారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం దివంగత సీఎం వైఎస్సార్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీలో ఇప్పటికే అందుతోందని కవిత మరచిపోయినట్లున్నారు. అర్హులైన యువతకు రు 2 లక్షల నుండి రు. 20 కోట్ల వరకు స్వయం ఉపాధి రుణాలు ఇస్తామని చెప్పారు. ఈ హామీ అమలు అవ్వాలంటే లక్షల కోట్ల రూపాయలు అవసరం.

అర్హులైన పేద కుటుంబాలకు తలా ఒక ఎకరం భూమి పంపిణీ చేస్తామన్నారు. ఇది జరగాలంటే ప్రభుత్వం దగ్గర లక్షల ఎకరాల భూమి ఉండాలి. ఈ హామీలను చూసిన తర్వాత కవిత హామీలు ఆచరణ సాధ్యంకాదని అర్ధమైపోతోంది.

Read More
Next Story