సర్వేలు కాంగ్రెస్ కొత్త అస్త్రమా?
x

'సర్వే'లు కాంగ్రెస్ కొత్త అస్త్రమా?


కాంగ్రెస్ తాజాగా 'ఫ్లాష్ సర్వే' నిర్వహించింది. దీనిలో జరిగిన మూడు రోజుల అసెంబ్లీ సమావేశాలపై ప్రజాభిప్రాయం సేకరించింది.ఈ సర్వే గురించి సిఎల్పి భేటిలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. సర్వే ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిందని కూడా ముఖ్యమంత్రి చెప్పారు.

దీనితో పాటు ఇంకో తాజా సర్వే కూడా వచ్చింది. ఈ సర్వే నిర్వహణ సంస్థ గురించి స్పష్టత లేకపోయినా ఈ సర్వే కూడా కాంగ్రెస్ కి సానుకూలంగానే నివేదిక ఇచ్చింది. రేవంత్ ప్రభుత్వానికి నలభై ఒక శాతం ఆదరణ ఉంటే,బీఆర్ఎస్ కి ముప్పై ఏడు శాతం ఉందని తేల్చింది ఈ సర్వే. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన సందర్భంగా వచ్చిన 'చాణక్య సర్వే' బీఆర్ఎస్ కి అనుకూలంగా ఇచ్చిన సంగతి తెలిసిందే.

ప్రజాదరణని పొందడానికి ఇప్పుడు కాంగ్రెస్ 'సర్వే' అస్త్రాన్ని వాడుతుందా అన్న చర్చలు పెరిగిపోతున్నాయి.



Read More
Next Story