కవిత లిక్కర్ స్కామ్ కేసు కొట్టి వేసిన ఢిల్లీ కోర్టు
x
Kalvakuntla Kavitha

కవిత లిక్కర్ స్కామ్ కేసు కొట్టి వేసిన ఢిల్లీ కోర్టు

లిక్కర్ స్కామ్ లో కవితది సౌత్ గ్రూప్ తరపున కీలక పాత్రగా సీబీఐ, ఈడీలు కేసులు పెట్టి ముందు విచారించి తర్వాత అరెస్టుచేసిన విషయం తెలిసిందే


కొంతకాలం క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యుటి సీఎం మనీష్ సిసోడియా లతో పాటు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితలను శుక్రవారం ఢిల్లీ రౌస్ ఎవిన్యు కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

మొత్తం 23 మంది నమోదైన కేసులను కోర్టు కొట్టేసింది. సిబిఐ వేసిన ఈ కేసులో ఉన్న మొత్తం 23 మంది నిందితులను న్యాయమూర్తి జితేంద్ర సింగ్ విడుదల చేశారు. విడుదలయిన వారిలో కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్, విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్‌పల్లి, అరుణ్ పిళ్లై, మూత గౌతమ్, సమీర్ మహేంద్రు, మనీష్ సిసోడియా, అమన్‌దీప్ సింగ్ ధాల్, అర్జున్ పాండే, బుచ్చిబాబు గోరంట్ల, రాజేష్ జోషి, దామోదర్ ప్రసాద్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ కుమార్ సింగ్, చన్‌ప్రీత్ కేవీర్గేల్, అరవింద్ కుమార్ సింగ్, చన్‌ప్రీత్ కెవిజ్వాల్ పాఠక్, అమిత్ అరోరా, వినోద్ చౌహాన్, ఆశిష్ చంద్ మాథుర్, శరత్ రెడ్డి లు కూడ ఉన్నారు. ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ పెద్ద కుట్రగాని, క్రిమినల్ ఉద్దేశాలు కూడా లేవని జడ్జి వ్యాఖ్యానించారు. ఈ కేసు వేయడంలో సిబిఐ ఉద్దేశాన్ని కోర్టు ప్రశ్నించింది.

కేవలం వూహాగానాలో ఒక కుట్రకేసు కథనం సృష్టించేందుకు సిబిఐ ప్రయత్నించిందని, అయితే అది కోర్టు పరిశీలనకు నిలువలేకపోయిందని న్యాయమూర్తి వాఖ్యానించారు.

దీనితో చార్జ్ షీట్ లో పేర్కొన్న ఇరవై మూడు మంది మీద ఎలాంటి ఆరోపణల నిలవకుండాపోయిందని కూడా కోర్టు వ్యాఖ్యానించింది.

కేవలం అప్రూవర్లు ఇచ్చిన స్టేట్ మెంట్స్ ఆధారంగా సిబిఐ కేసును సృష్టించేందుకు ప్రయత్నించిందని సిబిఐ దోరణిని కోర్టు విమర్శించింది.

ఇటువంటి ధోరణిని అనుమతిస్తే, అది తీవ్రమయిన రాజ్యాంగ సూత్రాల ఉల్లంఘన అవుతుందని కూడా కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది.

కవితకు రిలీఫ్

ఈరోజు కోర్టు తీర్పుతో కవితకు బిగ్ రిలీఫ్ అనేచెప్పాలి. లిక్కర్ స్కామ్ లో కవితది సౌత్ గ్రూప్ తరపున కీలక పాత్రగా సీబీఐ, ఈడీలు కేసులు పెట్టి ముందు విచారించి తర్వాత అరెస్టుచేసిన విషయం తెలిసిందే.

అరెస్టయిన కవిత ఆరునెలలపాటు ఢిల్లీలోని తీహార్ జైలులో గడిపారు. తర్వాత బెయిల్ తీసుకుని బయట తిరుగుతున్నారు. లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న కవిత రాజకీయంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. చివరకు బీఆర్ఎస్ నుండి గెంటివేతకు కారణాల్లో లిక్కర్ స్కామ్ కూడా ఒకటి అనటంలో సందేహంలేదు. ఇలాంటి స్కామ్ లో కేజ్రీవాల్, సిసోడియా, కవితతో పాటు మరికొందరు పాత్రపై ఎలాంటి సాక్ష్యాలు లేవని రౌస్ ఎవిన్యు కోర్టు తీర్పు చెప్పటం అంటే రాజకీయాల్లో ఉన్న వారందరికీ బిగ్ రిలీఫ్ అనేచెప్పాలి.

మద్యంపాలసీ రూపకల్పనలో కేజ్రీవాల్, సిసోడియా, కవితతో పాటు మరికొందరు వ్యాపారస్తుల దగ్గర ముడుపులు తీసుకుని పాలసీని వ్యాపారులకు అనువుగా తయారుచేసినట్లుగా పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఆరోపణల ఆధారంగానే పైన చెప్పిన వారందరిపైనా సీబీఐ, ఈడీలు కేసులు నమోదుచేసి విచారణల తర్వాత అరెస్టులు కూడా చేసింది. సరైన ఆధారాలు లేకుండానే కేసులో పైన చెప్పిన వారి పేర్లను చేర్చి, అరెస్టుచేయటంపై కోర్టు సీబీఐ పైన తీవ్రస్ధాయిలో మండిపడింది. ఏదేమైనా ఇన్నాళ్ళు లిక్కర్ రాణి అనే నిందను మోస్తున్న కవితకు ఈరోజు బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి.

Read More
Next Story