
బీజేపీ నేతలకు నబీన్ పెద్ద షాకిచ్చారా ?
రెండుగంటల సమావేశంలో నేతల పనితీరుపై మండిపడినట్లు సమాచారం.
బీజేపీ నేతలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ చాలా పెద్ద షాకే ఇచ్చారు. ఇంతకీ ఆ టార్గెట్ ఏమిటంటే తొందరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో గెలిచి తీరాల్సిందే అని చెప్పారు. మూడురోజుల తెలంగాణ పర్యటనలో పార్టీ ప్రజాప్రతినిదులు, సీనియర్ నేతలతో నబీన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రెండుగంటల సమావేశంలో నేతల పనితీరుపై మండిపడినట్లు సమాచారం.
బీజేపీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతల పనితీరుపై నబీన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు ఏకతాటిపైకి వచ్చి పనిచేయకపోతే భవిష్యత్ కష్టమే అని తేల్చిచెప్పారు. అధికారంలోకి రావటానికి అవకాశమున్నా ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతల మధ్య విభేదాలవల్లే పార్టీ దెబ్బతింటోందనే అసంతృప్తిని వ్యక్తంచేశారు.
ప్రజా ప్రతినిధులు, సీనియర్ నేతల పనితీరును జాతీయ నాయకత్వం ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తోందని స్పష్టంచేశారు. పార్టీ పనితీరును ఎప్పటికప్పుడు అంచనావేయటానికి ప్రతినెలా జాతీయ నేతలు తెలంగాణకు వస్తారని హెచ్చరించారు.

