
బిల్లు వీగిపోవడం మోదీ ఓటమే: రేవంత్
డిలిమిటేషన్ వివాదం, మహిళా రిజర్వేషన్ల అమలుపై సూచనలు, విపక్షాల ఐక్యతపై కీలక వ్యాఖ్యలు.
పార్లమెంటులోలో రాజ్యంగ సవరణ బిల్లు వీడిపోవడం అంటే బీజేపీ తెచ్చిన చట్టాల ఓటమి కాదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇది ముమ్మాటికీ బీజేపీ చిత్తశుద్ధి, మోదీ ఓటమేనని అన్నారు. ప్రేరేపిత రాజకీయ ప్రయోజనాలకు కేంద్రం చేసిన ప్రయత్నాలను ప్రజలు, ప్రతిపక్షాలన్నీ కలిసి ఓడించాయని, అందుకు ఈ బిల్లు వీగిపోవడం నిదర్శనమని వ్యాఖ్యానించారు రేవంత్. మహిళ రిజర్వేషన్ల ముసుగులో సీట్ల పెంపు కార్యక్రమాన్ని బీజేపీ చేపట్టిందని ఆయన అన్నారు. రిజర్వేషన్లను పూర్తిగా మట్టుబెట్టడమే దీని వెనక అసలు ఉద్దేశమని ప్రజలు గ్రహించారని, ప్రతిపక్షాలు కూడా ఇదే విషయాన్ని తమ ఓట్ల రూపంలో చూపిందని రేవంత్ పేర్కొన్నారు.
లోక్‌సభలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ, దక్షిణ భారతానికి జరిగే అన్యాయాన్ని అడ్డుకున్నామని రేవంత్ తెలిపారు. మహిళా బిల్లు పేరుతో డీలిమిటేషన్‌ను తీసుకురావాలని ఎన్డీయే ప్రయత్నించిందని ఆరోపించారు. ఈ బిల్లు ఓడిపోవడం బీజేపీ విధానాల పరాజయమని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాలను కాంగ్రెస్ అడ్డుకుందని వెల్లడించారు. మహిళా రిజర్వేషన్లపై తమకు పూర్తి మద్దతు ఉందని సీఎం స్పష్టం చేశారు.
2023 బిల్లును యథాతథంగా అమలు చేస్తే వెంటనే మద్దతు ఇస్తామని తెలిపారు. ఓబీసీ కోటా చేర్చాలని సూచించారు. డీలిమిటేషన్‌పై హైబ్రిడ్ మోడల్ అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. సీట్ల పెంపు పేరుతో మహిళా రిజర్వేషన్లను ముసుగుగా ఉపయోగించారని విమర్శించారు. బీజేపీకి 400 సీట్లు వచ్చినట్లయితే రాజ్యాంగ మార్పులు జరిగేవని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలిసింది. రిజర్వేషన్లు తొలగించే కుట్ర ఉందని ఆరోపించారు.
విపక్షాల ఐక్యతతో కేంద్రం వెనక్కి తగ్గిందని తెలిపారు. ఇది రాజకీయ ఓటమి కాదని, విధానాల పరాజయమని అభిప్రాయం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్లను త్వరగా అమలు చేయాలని సీఎం డిమాండ్ చేశారు. యూపీ ఎన్నికలలోపు అమలు చేస్తే ప్రజల మద్దతు స్పష్టమవుతుందని పేర్కొన్నారు. డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరిగేదని ఆయన అన్నారు. ఉత్తర, దక్షిణ మధ్య అంతరాలు పెరగకుండా చూడాలని సూచించారు. మహిళా రిజర్వేషన్ అమలుపై చర్చించి, విపక్షాలతో సమన్వయం చేసి ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ ప్రక్రియలో అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకోవాలని పేర్కొన్నారు.

